సంక్షేమ అజెండాకు కౌన్సిల్ పచ్చజెండా
సిరిసిల్లటౌన్: ప్రజాసంక్షేమం, అభివృద్ధి పనులకు మున్సిపల్ అజెండాకు కౌన్సిల్ పచ్చజెండా ఊపింది. సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిల్ హాలులో బుధవారం చైర్‌పర్సన్ జిందం కళ అధ్యక్షతన అత్యవసర సమావేశం నిర్వహించారు. పట్టణంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు. రెండో బైపాస్‌రోడ్డులో వీధి దీపాలు లేక ప్రమాదాలు జరుగుతున్నందునా లైటింగ్ ఏర్పాటుకు నిధుల కేటాయింపు కోసం కలెక్టర్‌కు విన్నవించాలని, గతంలో డ్రాలో జాబితాలో పేర్లు వచ్చిన అర్హులకు, ఎస్సీలకు ఇవ్వాల్సిన డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై చర్చసాగింది. గతంలో చేపట్టిన రూ.41కోట్ల అభివృద్ధి పనులు నిలిచిపోగా.. ఆ నిధుల విడుదల కోసం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ను కలవాలని నిర్ణయించారు.
రూ.60లక్షలతో పనులు
సిరిసిల్లలో శానిటేషన్ నిర్వహణలో భాగంగా మ్యానువల్ స్వీపింగ్ మిషిన్లు, బ్లీచింగ్ కొనుగోలు, డంప్‌యార్డులో సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ.9లక్షలు కేటాయించారు. ప్రధాన డ్రెయినేజీల్లో సిల్టు తొలగించి మినీ ఎక్సావేటర్ మిషన్ కొనుగోలుకు రూ.26లక్షలు, తాగునీటి సరఫరా, నిర్వహణలో వాటర్ సప్లయ్ మెటీరియల్, ఫ్రీ అండ్ పోస్ట్ క్లోరినేషన్ ప్లాంటు ఏర్పాటుకు రూ.13లక్షలు, సీసీరోడ్లు, డ్రెయినేజీల నిర్మాణానికి రూ.12లక్షలు మొత్తంగా రూ.60లక్షల పనులకు పరిపాలనపరమైన మంజూరు ఇవ్వడం జరిగిందని చైర్‌పర్సన్ జిందం కళ, మున్సిపల్ కమిషనర్ దుబ్బాక లావణ్య తెలిపారు. వైస్‌చైర్మన్ మంచె శ్రీనివాస్, మేనేజర్ మీర్జా ఫసహత్ అలీబేగ్ తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్ల మున్సిపల్ సమావేశంలో తీర్మానం
రూ.60లక్షల పనులకు గ్రీన్‌సిగ్నల్
వివరాలు వెల్లడించిన చైర్‌పర్సన్ జిందం కళ
Comments
Please login to add a commentAdd a comment