బ్యాంక్ గ్యారంటీ ఇవ్వలేం
సిరిసిల్ల: వానాకాలం సీజన్ వడ్లను దింపుకునేందుకు బ్యాంకు గ్యారంటీ ఇవ్వలేమని జిల్లా రా రైస్ మిల్లర్లు స్పష్టం చేశారు. ఈ మేరకు కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్‌లకు బుధవారం రా రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు పబ్బ నాగరాజు, కార్యదర్శి రాజిరెడ్డి వినతిపత్రం అందించారు. వారు మాట్లాడుతూ బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చే ఆర్థిక స్థోమత లేదన్నారు. అప్పులు చేసి మిల్లులు పెట్టుకున్నామని, అయినా కష్టనష్టాలు భరించి సీఎమ్మార్‌లో పాలుపంచుకున్నట్లు తెలి పారు. ఆస్తులు కుదువపెట్టి బ్యాంక్ లోన్లు తీసుకుని తీర్చలేక ఇబ్బంది పడుతున్నామన్నారు. నూక డ్యా మేజీ శాతం ఎక్కువగా రావడంతో నష్టపోతున్నామన్నారు. సన్న ధాన్యం మిల్లింగ్ చేస్తే 67 కేజీల బి య్యం ఔటర్న్ రాదని, వాస్తవాలకు అనుగుణంగా తగ్గించాలని కోరారు. పెండింగ్ మిల్లింగ్ చార్జీలు చె ల్లించాలని కోరారు. 2023–2024 సీఎమ్మార్ బకా యిలు కూడా అందిస్తామని స్పష్టం చేశారు. సంఘం కోశాధికారి చేపూరి శ్రీని వాస్, గౌరవాధ్యక్షుడు గరిపెల్లి ప్రభాకర్, ఉపాధ్యక్షుడు వంశీధర్‌రావు, సభ్యులు సత్యంరావు, నగునూరి శ్రీకాంత్, ఉప్పల కృష్ణమూర్తి, పుల్లూరి శ్రీని వాస్, బంధం వెంకన్న, చేపూరి అంజన్న, బండ సతీశ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment