2న కేజీబీవీ పోస్టులకు సర్టిఫికెట్ల పరిశీలన
సిరిసిల్లఎడ్యుకేషన్: జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న మహిళా అధ్యాపక పోస్టుల భర్తీకి గతేడాది జూలైలో నిర్వహించిన అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైన మెరిట్ జాబితా ఆధారంగా ప్రస్తుతం ఖాళీలను భర్తీ చేయనున్నట్లు డీఈవో రమేశ్ తెలిపారు. గతంలో సాధించిన ఫలితాల ఆధారంగా ఖాళీగా ఉన్న సబ్జెక్ట్ పోస్టులకు ఎంపికై న 1:3 అభ్యర్థుల జాబితా సిరిసిల్ల విద్యాధికారి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. జాబితాలో ఉన్న అభ్యర్థులు నవంబర్ 2న డీఈవో కార్యాలయంలో హాజరుకావాలని సూచించారు. వివరాలకు హెల్ప్‌డెస్క్ 96429 59599, 94931 11179లలో సంప్రదించాలని కోరారు.
అకాల వర్షం.. తడిసిన ధాన్యం
గంభీరావుపేట(సిరిసిల్ల): మండలంలో బుధవారం మధ్యాహ్నం కురిసిన అకాల వర్షంతో ధాన్యం తడిసింది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం వర్షానికి తడిసిపోయింది. తేమశాతం తగ్గించేందుకు రైతులు కేంద్రాల్లో ధాన్యం ఆరబెట్టగా.. హఠాత్తుగా కురిసిన వర్షంతో తడిసిపోయింది. ఇప్పటికై నా అధికారులు త్వరగా కొనుగోళ్లు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
రాజన్నను దర్శించుకున్న అఘోరి
వేములవాడఅర్బన్/కొండగట్టు: వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్నను బుధవారం అఘోరి దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. సనాతన ధర్మంపై అవగాహన కల్పించడం కోసమే ఆలయాలు సందర్శిస్తున్నట్లు తెలిపారు. అయితే ఆమెను చూసేందుకు భక్తులు ఎగబడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment