రాజ్యాంగం చాలా గొప్పది
సిరిసిల్ల: భారత రాజ్యాంగం చాలా గొప్పదని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అన్నారు. మంగళవారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, బ్రిటీష్ వారు మన దేశాన్ని 200 ఏళ్లకు పైగా పాలించారని, ఎన్నో పోరాటాల ఫలితంగా మనకు స్వాతంత్య్రం లభించిందన్నారు. రాజ్యాంగం రచించడానికి కమిటీ ఏర్పాటు చేసి 1949 నవంబర్ 26న తుది రాజ్యాంగం ఆమోదించబడిందని వివరించారు. 2015 నుంచి రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నామని, దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించేందుకు పలువురు విద్యావేత్తలు, న్యాయనిపుణులు, వివిధ రంగాల ప్రముఖులతో రాజ్యాంగ నిర్మాణ సభను ఏర్పాటు చేశారని వివరించారు. రెండేళ్ల 11 నెలల 18 రోజుల పాటు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నేతృత్వంలోని డ్రాఫ్ట్ కమిటీ రాజ్యాంగాన్ని రూపొందించిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీవో శ్రీనివాసాచారి, డీపీఆర్వో వి.శ్రీధర్, ఉపాధి కల్పనాధికారి రాఘవేందర్, మున్సిపల్ కమిషనర్ లావణ్య, కలెక్టరేట్ ఏవో రాంరెడ్డి, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు జావేద్ అహ్మద్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
Comments
Please login to add a commentAdd a comment