టీజీవో జిల్లా అధ్యక్షుడిగా సమరసేన్
సిరిసిల్ల/సిరిసిల్లటౌన్: తెలంగాణ గెజిటెడ్ అధికారుల (టీజీవో) సంఘం జిల్లా అధ్యక్షుడిగా సమరసేన్, ప్రధాన కార్యదర్శిగా సయ్యద్ జబీఉల్లా మంగళవారం ఎన్నికయ్యారు. ఆంకారపు నర్సయ్య ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో గెజిటెడ్ అధికారులు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అసోసియేటెడ్ ప్రెసిడెంట్ జె.రాజు, కోశాధికారిగా అబ్దుల్ రసూల్ అహ్మద్, ఉపాధ్యక్షులు డాక్టర్ అంజిరెడ్డి, అబ్దుల్ వాజిద్, ఎన్.శరత్‌కుమార్, ఎన్ఆర్ మల్హొత్రా, ఎం.జానకి, జాయింట్ సెక్రటరీ ఎ.సాయికిరణ్, బి.శ్రీకాంత్, వి.చంద్రకళ, ఆర్గనైజింగ్ సెక్రటరీ బి.సాగర్, పబ్లిసిటి సెక్రటరీ బి.కిరణ్, ఆఫీస్ సెక్రటరీ కె.వరుణ్, కల్చరర్ సెక్రటరీ కె.వినోద్, స్పోర్ట్స్ సెక్రటరీ వి.లక్షణ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు ఆర్.శేఖర్, ఎ.కవిత, ఎన్.భాగ్యలక్ష్మి, ఎం.శ్రావ్యపటేల్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీ మూడేళ్ల పాటు ఉంటుందని ఎన్నికల అధికారి పి.శ్రీరామ్‌రెడ్డి ప్రకటించారు. టీజీవో రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఏలూరి శ్రీనివాస్, ఎ.సత్యనారాయణ పాల్గొన్నారు. అంతకుముందు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి నివాళి అర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment