తప్పు చేస్తే.. శిక్ష తప్పదు
● కోర్టులో సాక్ష్యాలు, ఆధారాలు ● నేర నిరూపణకు ఖాకీల కసరత్తు ● జిల్లాలో వరుసగా తీర్పుల వెల్లడి ● జైలుకు వెళ్తున్న నేరస్తులు ● నిత్యం సమన్వయం తో సత్ఫలితాలు ● ఎస్పీ అఖిల్ మహాజన్
వెదికి మరీ..
వేములవాడ డివిజన్ పరిధిలో ఒకరు హత్య చేసి వెంటనే గల్ఫ్ దేశానికి పరారయ్యాడు. ఓ పదేళ్లు గడిస్తే కేసు విషయాన్ని మరిచిపోతారని నేరస్తుడు భావించాడు. కానీ పోలీసులు తమ అధికారాలను ఉపయోగించి గల్ఫ్ దేశం నుంచి రిప్పించి, రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తులో ఉన్నట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. అంటే నేరాలు చేసి ఎక్కడికి పోయిన ఏదో ఒక రోజు పట్టుబడడం ఖాయమని, జైలుకెళ్లడం తప్పదని ఈ సంఘటనతో తేలిపోయింది.
చిన్న తప్పే.. తరచూ చేసి..
సిరిసిల్లలోని ఓ యువకుడు మద్యం సేవించి పోలీసులకు పట్టుబడ్డాడు.కోర్టులో హాజరై జరిమానా, క్షమాపణ చెబితే సరిపోతుందనుకున్నాడు. ఇలా పలుమార్లు పట్టుబడడం మళ్లీ మద్యం తాగి బైక్ నడపడం పరిపాటిగా మారింది. పోలీసుల రికార్డుల్లోని వివరాల ఆధారంగా మరోసారి పట్టుపడిన మందుబాబుకి జడ్జి ఒక రోజు జైలు శిక్ష వేయడంతో అసలు కథ అర్థమైంది. చిన్నతప్పిదమైనా పదే..పదే చేస్తే శిక్ష తప్పదని తెలిసిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment