సమస్యల పరిష్కారమే లక్ష్యం
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ● ప్రజావాణిలో 142 అర్జీలు స్వీకరణ
సిరిసిల్లటౌన్: ప్రజాసమస్యలు పరిష్కారమే ప్రజావాణి లక్ష్యమని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన సందర్భంగా మాట్లాడారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. రెవెన్యూకు 58, సిరిసిల్ల మున్సిపల్‌కు 20, ఎస్‌డీసీకి 10, ఎస్పీకి 7, విద్యాశాఖ, జిల్లా పంచాయతీ అధికారికి 4 చొప్పున, ఎల్‌డీఎం, వేములవాడ మున్సిపల్, ఉపాధి కల్పన శాఖకు 3 చొప్పున, డీసీఎస్‌వో, జిల్లా సంక్షేమాధికారి, ఎంపీడీవో కోనరావుపేట, ఎల్లారెడ్డిపేట, వేములవాడ, బోయినపల్లికి 2 చొప్పున, ఎంపీడీవో ఇల్లంతకుంట, ముస్తాబాద్, గంభీరావుపేట, చందుర్తి, ఇరిగేషన్, జిల్లా వైద్యాధికారి, వ్యవసాయాధికారి, డీఎం డబ్ల్యూవో, సెస్, డీటీడబ్ల్యూవో, హ్యాండ్‌లూమ్ అండ్ టెక్స్‌టైల్స్, డీపీఆర్వో, డీఎస్‌సీడీవో, ఎస్సీ కార్పొరేషన్, ఆర్టీసీ సిరిసిల్ల, డీబీసీడీవో ఒకటి చొప్పున మొత్తం 142 దరఖాస్తులు వచ్చాయి.
పాస్‌బుక్ ఇప్పించాలి
మా గ్రామంలో సర్వేనంబరు 434లో 1.35 ఎకరాల భూమి ఉంది. నాకు పట్టాదార్ పాస్‌బుక్ రాలేదు. ధరణిలో టీఎం33 మాడ్యుల్‌లో మిస్సింగ్ సర్వే కింద అప్లయ్ చేసిన. ఇప్పటికీ మూడు నెలలైంది. నాపేరు మీద భూమి ఎక్కలేదు. కలెక్టర్ స్పందించి పాస్‌బుక్ ఇప్పించాలి. – మారుపాక పద్మ, నిమ్మపల్లి
Comments
Please login to add a commentAdd a comment