నిరసనలు.. నినాదాలు
సిరిసిల్లటౌన్: నిరసనలు.. నినాదాలతో సోమవారం కలెక్టరేట్ ప్రాంగణం హోరెత్తింది. ప్రజాసంఘాలు, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో సోమవా రం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన దీక్ష సోమవారం నాటికి 14వ రోజుకు చేరింది. దీక్షలో భాగంగా కలెక్టరేట్ గేట్ ఆర్చి వద్ద నల్లదుస్తులతో నిరసన తెలిపారు. సమగ్ర శిక్షను విద్యాశాఖలో విలీనం చేయాలని కోరారు. ముస్తాబాద్ డీటీఎఫ్ మండల బాధ్యులు బాదవేణి అంజయ్య సంఘీభావం తెలిపారు.
● ప్రభుత్వ వస్త్రాల తయారీలో పాల్గొనే కార్మికులకు రోజుకు రూ.వెయ్యి చొప్పున వేతనం వచ్చేలా కూలి నిర్ణయించాలని పవర్‌లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూశం రమేశ్ డిమాండ్ చేశారు. ఈమేరకు కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝాకు వినతిపత్రం అందించారు. అన్నల్‌దాస్ గణేశ్, సత్యం, ప్రవీణ్‌కుమార్ ఉన్నారు.
● సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లకు పండ్లు, కూరగాయలు సరఫరా చేసే కాంట్రాక్టర్ల బాధలు పట్టించుకో వాలని సప్లయర్స్ ఎల్లయ్య, సంతోష్, భాస్కర్, నాగరాజు కోరారు.
● వేతనాలు ఇప్పించాలని ఇల్లంతకుంట మండలంలోని ప్రభుత్వ స్కూళ్లలోని స్కావెంజర్లు కోరారు. ఐదు నెలలుగా వేతనాలు రావడం లేదన్నారు. దండి లక్ష్మి, బాలలక్ష్మి, శోభ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment