పీవీకి ఆది నివాళి
వేములవాడ: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 20వ వర్ధంతిని అసెంబ్లీ లాంజ్‌లో సోమవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పీవీ నరసింహారావు చిత్రపటం వద్ద నివాళి అర్పించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మంత్రి శ్రీధర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
గెలుపోటములు సహజం
● మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
ఇల్లంతకుంట(మానకొండూర్): క్రీడల్లో గెలుపోటములు సహజమని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. ఇల్లంతకుంటలో స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎమ్మెల్యే కప్ క్రికెట్ టోర్నీని సోమవారం ప్రారంభించి మాట్లాడారు. సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి, స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు మామిడి రాజు, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు రాఘవరెడ్డి, ఏఎంసీ వైస్‌చైర్మన్ ఎలగందుల ప్రసాద్ పాల్గొన్నారు.
ఓటుహక్కు తొలగించడం నేరం
తంగళ్లపల్లి(సిరిసిల్ల): రెవెన్యూ అధికారులు అధికార పార్టీ నాయకులకు అండగా నిలుస్తూ అక్రమంగా ఓట్లను తొలగిస్తున్నారని తంగళ్లపల్లి బీఆర్‌ఎస్ నాయకులు మండిపడ్డారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించిన సందర్భంగా మాట్లాడారు. మాజీ సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు వలకొండ వేణుగోపాలరావు మాట్లాడుతూ తమ గ్రామంలో 82 మంది ఓట్లను అకారణంగా తొలగిస్తున్నారని ఆరోపించారు. బతుకుదెరువు కొరకు ఇతర ప్రాంతాలకు తాత్కాళికంగా వలస వెళ్తే ఓట్లు తొలగించడం అధికార దుర్వినియోగానికి నిదర్శనమన్నారు. ఓట్ల గల్లంతు, అక్రమ తొలగింపులపై విచారణ చేపట్టాలని కోరారు. మాజీ జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మాట్ల మధు, బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు గజభీంకార్ రాజన్న తదితరులు పాల్గొన్నారు.
31లోపు రబీ టెండర్‌లను పూర్తి చేయాలి
సిరిసిల్లకల్చరల్: రబీ 2022–23 టెండర్ డెలివరీస్‌ను ఈనెల 31లోపు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం జిల్లాలోని రా, బాయిల్డ్ రైస్‌మిల్లర్లతో సమావేశమయ్యారు. ఖీమ్యానాయక్ మాట్లాడుతూ నెలాఖరులోపు డెలివరీస్‌ను పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా పౌరసరఫరాల అధికారి పి.వసంతలక్ష్మి, మేనేజర్ రజిత, డిప్యూటీ తహసీల్దార్లు నవీన్‌కుమార్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment