కాంగ్రెస్ హామీలు ఉత్తకోతలే..
● కాళేశ్వరంపై ప్రభుత్వానికి అవగాహన లేదు ● మాజీ ఎంపీ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్
సిరిసిల్లటౌన్: ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఉత్తకోతలేనని తేలిపోయాయని రాష్ట్ర ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ ఎద్దేవా చేశారు. సిరిసిల్లలోని తెలంగాణ భ వనంలో సోమవారం మీడియా సమావేశంలో మా ట్లాడారు. తెలంగాణకు వరప్రదాయిని కాళేశ్వ రం ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌రెడ్డి సహా మంత్రులకు ఏమాత్రం అవగాహన లేదన్నారు. మేడిగడ్డను వెంటనే మరమ్మతు చేయించి, గోదావరి జలాలను ఎత్తి పోయాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలకు ఉచిత బస్సు మినహా ఆరు గ్యారంటీల్లో ఏ ఒక్కటి పూర్తి చేయలేదన్నారు. రేవంత్ సర్కార్ ఏడాది పాలనలో విఫలమైందన్నారు. జిల్లాలో బీఆర్‌ఎస్ నేతలపై భూకబ్జాల కేసులు కక్షసాధింపు చర్యల్లా ఉన్నాయన్నారు. టీఎస్‌పీటీడీసీ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, నాయకులు బొల్లి రామ్మోహన్, గుండ్లపెల్లి పూర్ణచందర్, కుంభాల మల్లారెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment