హై బీపీతో ఫీల్డ్ అసిస్టెంట్ మృతి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్‌నగర్‌కు చెందిన పులి రాజు(36) అనే ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్ హైబీపీతో మెదడులో నరాలు చిట్లి శనివారం రాత్రి మృతి చెందాడు. దీంతో స్వగ్రామంలో విషాదం అలుముకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. రాజు ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గతేడాది రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సమయంలో తలకు బలమైన గాయాలయ్యాయి. అప్పటి నుంచి హైబీపీతో ఇబ్బంది పడుతున్నాడు. వారం క్రితం అస్వస్థతకు గురైన రాజును కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు తరలించారు. అక్కడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి మరణించాడు. రాజు భార్య లత గతంలో ఎంపీటీసీగా పనిచేశారు. మృతునికి భార్య లతతోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. రాజు ఆకస్మిక మృతిపై మాజీ జెడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు, పలువురు ప్రజాప్రతినిధులు, ఉపాధిహామీ అధికారులు సంతాపం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment