అప్పాలు..
బీర్‌పూర్‌లో పిండి వంటలు చేస్తున్న మహిళలు
సంక్రాంతి స్పెషల్
సంక్రాంతి వచ్చేసింది.. గాదె నిండా ధాన్యం, చేతి నిండా ధనంతో అన్నదాతల కుటుంబాల్లో సంతోషం నింపే పండుగ. ప్రత్యేక పిండి వంటలతో ప్రతీ ఇల్లు ఘుమఘుమలాడుతోంది. సకినాలు, గారెలు, అరిసెలు, చేగోడీలు, కారపూస వంటివి తయారు చేసుకోవడంతో వారం, పది రోజుల ముందునుంచే పండుగ వాతావరణం నెలకొంది. ఇరుగుపొరుగు మహిళలు అప్పాలు చేయడంలో ఒకరికొకరు సహకరించుకుంటున్నారు. కుశల ప్రశ్నలు, మాటాముచ్చట్లతోపాటే పిండివంటల తయారు చేస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా తెలుగిళ్లలో చేసే అప్పాలు నోరూరించడమే కాదు.. ఆరోగ్యానికి దోహదం చేసే మంచి పోషక విలువలను కలిగి ఉంటాయి. పండుగ నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవులు రావడంతో విద్యార్థులు ఇళ్లవద్ద ఆటపాటలతో సందడి చేస్తున్నారు. ఆడబిడ్డలు తమ పట్టింటికి చేరుకుంటున్నారు. పల్లెలన్నీ సంక్రాంతి శోభ సంతరించుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment