ఓబన్న స్ఫూర్తితో..
సిరిసిల్ల: తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న చిరస్మరణీయుడని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో బీసీ సంక్షేమశాఖ శనివారం నిర్వహించిన వడ్డే ఓబన్న 218వ జయంతిలో పాల్గొని, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఓబన్న స్ఫూర్తితో యువత ముందుకెళ్లాలన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్, జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి రాజమనోహర్, జెడ్పీ సీఈవో వినోద్‌కుమార్, డీపీఆర్వో శ్రీధర్, వడ్డెర నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment