పార్టీ బలోపేతానికి కృషి చేయండి | - | Sakshi
Sakshi News home page

పార్టీ బలోపేతానికి కృషి చేయండి

Published Sun, Jan 12 2025 1:30 AM | Last Updated on Sun, Jan 12 2025 1:30 AM

పార్ట

పార్టీ బలోపేతానికి కృషి చేయండి

బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ

వేములవాడ: పార్టీ బలోపేతానికి కార్యకర్తలు పనిచేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ కోరారు. జిల్లాలోని 8 మండలాలకు నూతన అధ్యక్షులను శనివారం నియమించిన సందర్భంగా మాట్లాడారు. వేములవాడ టౌన్‌ అధ్యక్షుడిగా రాపెల్లి శ్రీధర్‌, జిల్లా కౌన్సిల్‌ సభ్యుడిగా నాగుల మల్లేశంగౌడ్‌, వేములవాడరూరల్‌ అధ్యక్షుడిగా బూర్గుపల్లి పరమేశ్‌, జిల్లా కౌన్సిల్‌ సభ్యుడిగా జక్కుల తిరుపతి, వేములవాడఅర్బన్‌ అధ్యక్షుడిగా బుర్ర శేఖర్‌గౌడ్‌, జిల్లా కౌన్సిల్‌ సభ్యుడిగా చిట్టిపల్లి వెంకటేశ్వర్‌రావు, కోనరావుపేట మండల అధ్యక్షుడిగా మిర్యాలకార్‌ బాలాజీ, జిల్లా కౌన్సిల్‌ సభ్యుడిగా గొట్టేరు రామచంద్రం, చందుర్తి మండల అధ్యక్షుడిగా మొకిల్‌ విజయేందర్‌, జిల్లా కౌ న్సిల్‌ సభ్యుడిగా పోంశెట్టి రాకేశ్‌, కథలాపూర్‌ మండల అధ్యక్షుడిగా మల్యాల మారుతి, జిల్లా కౌన్సిల్‌ సభ్యుడిగా కె.మహేశ్‌లను నియమించారు. కుమ్మరి శంకర్‌, రేగుల మల్లి కా ర్జున్‌, బండ మల్లేశం, కిష్టస్వామి పాల్గొన్నారు.

సందల్‌ ఊరేగింపు

గంభీరావుపేట(సిరిసిల్ల): మండలంలోని ముస్తఫానగర్‌లోని మీరా శేఖాద్రిదర్గాలో శనివారం ఉర్సు ఉత్సవాలు ప్రారంభమయ్యా యి. ఉత్సవాల్లో భాగంగా దర్గా పూజారి అబ్దుల్‌ రహీం ఇంటి నుంచి గంధాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి ప్రార్థనలు చేశారు. దర్గా మూతవల్లి అబ్దుల్‌ రహీం, మహ్మద్‌ ఆసిఫ్‌, మహ్మద్‌ ఆరిఫ్‌, మహ్మద్‌ లతీఫ్‌, అబ్దుల్‌ వహీద్‌, అబ్దుల్‌ లతీఫ్‌, మహ్మద్‌ ఖలీముద్దీన్‌, షేక్‌ ఇక్బాల్‌ తదితరులు పాల్గొన్నారు.

గంజాయి కాల్చివేత

సిరిసిల్లక్రైం: జిల్లా పోలీసులు వివిధ సందర్భాల్లో పట్టుకున్న 26.437 కేజీల గంజాయిని శనివారం డిస్ట్రిక్ట్‌ డ్రగ్స్‌ డిస్పోజల్‌ కమిటీ ఆధ్వర్యంలో కాల్చివేశారు. మానకొండూర్‌ మండలం ఈదులగట్టపల్లిలోని వెంకటరమణ ఇన్సినేటర్స్‌ కామన్‌ బయోమెడికల్‌ వేస్ట్‌ ట్రీట్‌మెంట్‌ ఫెసిలిటీలో కాల్చినట్లు ఎస్పీ అఖిల్‌మహాజన్‌ వెల్లడించారు. ప్రస్తుతం సమాజాన్ని పీడిస్తున్న అతి పెద్ద సమస్య గంజాయి, ఇతర మత్తుపదార్థాలకు యువత బానిసలుగా మారి తమ అమూల్యమైన భవిష్యత్‌ను చేజేతులా నాశనం చేసుకుంటున్నారన్నారు. జిల్లాలో గంజాయి రవాణాను పోలీసులు సమర్థంగా నిరోధిస్తున్నారని, గంజాయి రహిత జిల్లాగా సిరిసిల్లను చేయడం ధ్యేయమన్నారు. ఏఎస్పీ చంద్రయ్య, డీసీఆర్బీ సీఐ శ్రీనివాస్‌, ఆర్‌ఐ రమేశ్‌ పాల్గొన్నారు.

డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి

ఇల్లంతకుంట(సిరిసిల్ల): వాహనాలు నడిపే సమయంలో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని జిల్లా మోటార్‌ వాహనాల తనిఖీ అధికారి వంశీధర్‌ సూచించారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవంలో భాగంగా ఆటోడ్రైవర్లు, వాహనదారులు, స్కూల్‌బస్సుల డ్రైవర్లతో శనివారం ఇల్లంతకుంట బస్టాండ్‌ ఆవరణలో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. మైనర్లు వాహనాలు నడపవద్దని, ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లవద్దని సూచించారు. వాహనాలకు బీమా చేయించుకోవాలన్నారు. కానిస్టేబుల్‌ ప్రశాంత్‌, హోమ్‌గార్డ్‌ ఎల్లయ్య, ఇల్లంతకుంట ఆటోయూనియన్‌ అధ్యక్షుడు ఎండీ ఇమ్రాన్‌, రవి, సాయిలు, ఆర్టీసీ కంట్రోలర్‌ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

ప్రభుత్వ భూమి కబ్జాలో ఇద్దరి రిమాండ్‌

డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి

సిరిసిల్లక్రైం: సిరిసిల్ల పట్టణ పరిధి పెద్దూర్‌లోని ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని సిరిసిల్ల పట్టణ పోలీసులకు అందిన ఫిర్యాదుతో ఇద్దరిపై కేసు నమోదుచేసి రిమాండ్‌ తరలించినట్లు సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి శనివారం తెలిపారు. సలేంద్రి బాలరాజు, గంగుల బాలయ్య ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్లు ప్రజావాణిలో ఫిర్యాదులు అందాయి. దర్యాప్తు చేసిన పోలీసులు వారిని శుక్రవారం అరెస్ట్‌ చేశారు. వీరికి సహకరించిన ఇతర వ్యక్తులపై, ఉద్యోగులపై చట్టప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు డీఎస్పీ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
పార్టీ బలోపేతానికి   కృషి చేయండి
1
1/2

పార్టీ బలోపేతానికి కృషి చేయండి

పార్టీ బలోపేతానికి   కృషి చేయండి
2
2/2

పార్టీ బలోపేతానికి కృషి చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement