బీర్‌పూర్ నుంచి విదేశాలకు..
సారంగాపూర్(జగిత్యాల): బీర్‌పూర్ పిండి వంటలకు దేశ విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. గ్రామానికి చెందిన గోనె ప్రదీప్‌రావు, సుహాసిని దంపతులు హైదరాబాద్‌లోని తిలక్‌నగర్‌లో 18 ఏళ్ల క్రితం శ్రీలక్ష్మి తెలంగాణ పిండి వంటల పేరిట వ్యాపారం ప్రారంభించారు. దాదాపు 40 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తూ.. ప్రజలకు అందుబాటు ధరల్లో దొడ్డు అటుకుల చుడువ, పతుల అటుకుల చుడువ, మక్క చుడువ, గారెలు, మురుకులు, చేగోడీలు, బూంది, సన్నసేవు, తెల్ల సకినాలు, కారం సకినాలు, లడ్డూలు, మైసూర్‌పాక్, మరతపేణి, అరిసెలు, కొబ్బరి, చక్కెర కరియలు, నువ్వులు, బెల్లం కరియలు, భక్షాలు, సున్నుండలు వంటివి విక్రయిస్తున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, దుబాయ్, సింగపూర్, మలేషియా వంటి దేశాలకు కొరియర్ ద్వారా పంపిస్తున్నారు.
నాణ్యతకు ప్రాధాన్యం
మా శ్రీలక్ష్మి తెలంగాణ పిండి వంటల వ్యాపారం ప్రారంభించి, 18 ఏళ్లయింది. అప్పాల తయారీలో నాణ్యతే మాకు ప్రాధాన్యం. శుచి, శుభ్రత పాటించడంతో మాపై ప్రజల్లో నమ్మకం పెరిగింది.
– ప్రదీప్‌రావు, సుహాసిని, నిర్వాహకులు
Comments
Please login to add a commentAdd a comment