అరుణాచలానికి ప్రత్యేక బస్సులు
షాద్‌నగర్ రూరల్: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని టీఎస్ ఆర్టీసీ ఆధ్వర్యంలో తమిళనాడులోని అరుణాచలం క్షేత్రానికి ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నామని డీఎం ఉష తెలిపారు. డిపోలోని తన కార్యాలయంలో శుక్రవారం ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. అరుణాచలంలో ఈనెల 15న జరిగే గిరి ప్రదక్షిణకు హాజరు కావాలనుకుంటున్న భక్తుల కోసం ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. టికెట్ ధర పెద్దలకు రూ.3,600, పిల్లలకు రూ.2,400 నిర్ణయించామని తెలిపారు. ఈనెల 13న రాత్రి 7గంటలకు షాద్‌నగర్ నుంచి సర్వీస్ బయలుదేరుతుందని, 14న ఉదయం 6 గంటలకు కాణిపాకం, సాయంత్రం 4 గంటలకు వేలూరు గోల్డెన్ టెంపుల్‌ను దర్శించుకుని, రాత్రి అరుణాచలం చేరుకుంటుందని వివరించారు. 15న సాయంత్రం 4గంటలకు అరుణాచలంనుంచి బయలుదేరి, 16న ఉదయం 5గంటలకు షాద్‌నగర్ చేరుకుంటుందని స్పష్టంచేశారు. అనుభవం కలిగిన డ్రైవర్లు, సురక్షితమైన ప్రయాణం, పుష్‌బ్యాక్ సీట్లు, మొబైల్ చార్జింగ్ సౌకర్యం ఉంటుందని తెలిపారు. దైవదర్శనం టికెట్లు, అల్పాహారం, భోజన ఖర్చులు ప్రయాణికులే భరించుకోవాలన్నారు. ఆసక్తి కలిగిన భక్తులు డిపోలోని రిజర్వేషన్ కేంద్రంలో సంప్రదించాలని లేదా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.టీఎస్‌ఆర్‌టీసీఆన్‌లైన్.ఇన్ వెబ్‌సైట్‌ద్వారా రిజర్వేషన్ చేసుకోవాలని కోరారు. వివరాలకు ఫోన్: 9490021433, 9182645281, 9959226287 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
గిరిప్రదక్షిణకు వెళ్లే భక్తులు సద్వినియోగం చేసుకోవాలి
ఆర్టీసీ షాద్‌నగర్ డీఎం ఉష
Comments
Please login to add a commentAdd a comment