తడిసిన ధాన్యం.. రైతు దైన్యం
వట్పల్లి(అందోల్): అందోలు మండల పరిధిలోని రాంసాన్పల్లి, కన్సాన్పల్లి గ్రామాల్లో బుధవారం సాయంత్రం కురిసిన వర్షంతో ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నా రు. ఉదయం ఎండ ఉండటంతో రైతులు రోడ్లపై, కల్లాల్లో ధాన్యం ఆరబెట్టుకున్నారు. సాయంత్రం ఒక్కసారిగా వర్షం కురవడంతో తడిసి ముద్దయ్యాయి. భారీ వర్షంతో ధాన్యం కొట్టుకుపోయింది. ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతుల పడిన అవస్థలు వర్ణానాతీతం. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం తూకం చేసి కొనుగోళ్లు ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment