జాతీయస్థాయి క్రీడాకారులుగా ఎదగాలి
డీఈఓ రాధాకిషన్
పాపన్నపేట(మెదక్): గ్రామీణ విద్యార్థులు జాతీయస్థాయి క్రీడాకారులుగా ఎదగాలని డీఈఓ రాధాకిషన్ అన్నారు. పాపన్నపేటలో రెండు రోజులుగా జరిగిన జిల్లాస్థాయి క్రీడోత్సవాలు బుధవారం ము గిశాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఈఓ హాజరై మాట్లాడారు. విద్యార్థులు క్రీడల్లో అత్యున్నతస్థాయికి ఎదిగి, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తేవాలన్నారు. క్రీడలతో శారీరక, మానసిక ఆరో గ్యం మెరుగుపడుతుందన్నారు. క్రీడలతో గెలుపోటములు, సమయస్ఫూర్తి, పోరాట లక్షణాలు వస్తాయన్నారు. అందుకే తమ పిల్లలను క్రీడల వైపు మళ్లేలా చూడాలన్నారు. కబడ్డీ అండర్– 17 విభాగంలో కౌడిపల్లి మండలం మొదటిస్థానంలో, కొల్చారం రెండో స్థానం దక్కించుకుంది. అండర్– 14 విభాగంలో చేగుంట మొదటి స్థానంలో నిలిచింది. జిల్లాస్థాయిలో రాణించిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment