బీసీ కమిషన్కు వినతిపత్రం అందిస్తున్న వీరశైవ లింగాయత్ సమాజ్
లింగ బలిజ రాష్ట్ర అధ్యక్షుడు పట్లోళ్ల సంగమేశ్వర్, త దితరులు
రాష్ట్రంలోని వీరశైవ లింగాయత్, లింగ బలిజలను ఓబీసీలో చేర్చాలి. 2009 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం జీఓ నం.16, సీరియల్ నం.46లో బీసీ–డీలో కలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 40 లక్షలు ఉన్న జనాభాను దృష్టిలో ఉంచుకొని లింగాయత్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, రూ.1000 కోట్ల బడ్జెట్ను కేటాయించాలి. ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. సామాజికంగా, రాజకీయంగా, ఉద్యోగాలపరంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్నాం. బీసీ–డీలో కలుపుతూ జీఓ జారీ చేసినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యారంగపరంగా ఎలాంటి అవకాశాలు లభించడం లేదు. రాజకీయపరంగా అన్ని విధాలుగా అవకాశాలు కల్పించాలి. ఓబీసీలో చేర్చితే అన్ని రకాలుగా అన్ని అవకాశాలు లభిస్తాయి. –వీరశైవ లింగాయత్,
లింగ బలిజ కమిటీ సభ్యులు
Comments
Please login to add a commentAdd a comment