నకిలీ పత్రాలతో భూమి ఆక్రమణ
దుబ్బాకటౌన్: వంశపారంపర్యంగా వస్తున్న భూమిని ఆక్రమించిన వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేటకు చెందిన బాధితుడు బత్తిని మహేందర్ గౌడ్ వేడుకున్నాడు. శుక్రవారం దుబ్బాకలో ఆయన విలేకరులతో మాట్లాడారు. లచ్చపేటలో సర్వే నంబర్ 26లో కొంత భూమిని సిరిసిల్ల పట్టణానికి చెందిన ఓ వ్యక్తి కబ్జా చేశాడని ఆరోపిస్తూ, ఇటీవల గ్రామంలో విలేకరుల సమావేశం నిర్వహించిన వ్యక్తికి ఆ భూమితో ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆ భూమి తమ కుటుంబానికి చెందిందన్నారు. 1953 నుంచి తమ తాత బత్తిని సీతయ్య పేరిట 11.23 ఎకరాలు రికార్డుల్లో ఉందన్నారు. ఉపాధి కోసం సీతయ్య కుమారులు ఇతర ప్రాంతాలకు వలస పోవడంతో, వారి భూమిని పలువురు కబ్జా చేశారని వాపోయాడు. గ్రామానికి చెందిన కొంత మంది అక్రమార్కులు, స్థానిక ప్రజా ప్రతినిధుల అండతో తప్పుడు పత్రాలు సృష్టించి, భూములను కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవలె 1,805 గజాల స్థలాన్ని రాజన్న సిరిసిల్ల పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఫోర్జరీ పత్రాలతో రికార్డులు సృష్టించి, రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని, ఈ అంశం కోర్టు పరిధిలో ఉందన్నారు. తమ పూర్వీకులకు చెందిన భూమికి సంబంధించి కోర్టు కేసు ఉన్నందున ప్రజలు భూమిని కొనుగోలు చేసి ఇబ్బందులు పడొద్దని సూచించారు. భూమి వ్యవహారం కోర్టు పరిధి ఉండగా అమ్మడం, కొనడం చట్టవిరుద్ధమన్నారు.
ఉపాధి కోసం వెళ్తే
కబ్జా చేశారని బాధితుడి ఆవేదన
Comments
Please login to add a commentAdd a comment