ఇంతియాజ్‌కు సేవారత్న ఆవార్డు
చిలప్‌చెడ్(నర్సాపూర్): చిలప్‌చెడ్ మండలం చిట్కుల్ గ్రామానికి చెందిన మీర్జా ఇంతియాజ్‌కు శుక్రవారం భారతీయ స్ఫూర్తి సర్వీస్ సొసైటీ ఎన్జీవో హానర్ సంస్థ ఆధ్వర్యంలో సేవారత్న నేషనల్ అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ డాక్టర్ ఆకుల రమేశ్ హైదరాబాద్‌లోని ఆర్‌టీసీ క్రాస్ రోడ్‌లో గల కళాభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇంతియాజ్‌ను సన్మానించారు. అనంతరం ఇంతియాజ్ మాట్లాడుతూ.. తాను చేసిన సేవలను గుర్తించిన స్ఫూర్తి సొసైటీ సర్వీస్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు.
కథల పోటీల్లో పురస్కారం
హవేళిఘణాపూర్(మెదక్): బాలల దినోత్సవం సందర్భంగా తెలంగాణ సారస్వత పరిషత్ హైదరాబాద్ కోడూరు శాంతమ్మ స్మారక కథల పోటీల్లో మండల కేంద్రమైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థిని అర్పిత తెలుగు కథల పోటీల్లో రాష్ట్రస్థాయి ఉత్తమ కథగా నగదు బహుమతిని, పురస్కారాన్ని అందుకున్నారు. ఆదివారం తెలంగాణ సారస్వత పరిషత్ హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులు కేవీ రమణ, ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, వరప్రసాదరెడ్డి, గరిపల్లి అశోక్, జుర్రు చెన్నయ్య చేతుల మీదుగా బహుమతులు అందుకున్నారు. ఈ విషయంపై ప్రధానోపాధ్యాయులు కరుణాకర్ హర్షం వ్యక్తం చేశారు.
బేస్ బాల్ పోటీలకు ఎంపిక
సిద్దిపేటరూరల్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే 68వ రాష్ట్ర స్థాయి బేస్ బాల్ పోటీలకు జెడ్పీహెచ్‌ఎస్ నారాయణరావుపేట విద్యార్థులు ఎంపికై నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వడ్డేపల్లి నాగరాజు, పీడీ తోట సతీష్ శుక్రవారం తెలిపారు. అండర్ 17 విభాగంలో అభిరామ్ , నవనీత్, అండర్ 14 విభాగంలో దినేష్ రెడ్డి, వినయ్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఎంపికై న విద్యార్థులు 16 ,17, 18 తేదీల్లో నిర్మల్‌లో జరిగే పోటీల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి, మండల విద్యాధికారి మామిండ్ల గౌరీ మోహన్, ఎస్జీఎఫ్ సెక్రటరీ సౌందర్య, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్, ఉపాధ్యాయ బృందం అభినందించారు.
కుక్కల దాడిలో
16 మేకలు మృత్యువాత
కంగ్టి(నారాయణఖేడ్): వీధి కుక్కల దాడిలో మేకలు మృతి చెందిన ఘటన కంగ్టి మండలం దేగుల్‌వాడిలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన ఉప్పరి గణపతి, రాంచందర్ రోజులాగే మేకలను ఇంటి వద్ద ఏర్పాటు చేసిన కొట్టంలోకి పంపించారు. వీధి కుక్కల గుంపు ఒక్కసారిగా మేకలపై దాడి చేయడంతో 16 జీవాలు మృత్యువాత పడ్డాయి. దాదాపు రూ.80 వేల నష్టం వాటిల్లిందని బాధితులు వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment