కూలి డబ్బుల తగాదా.. తాపీమేసీ్త్ర హత్య
కూలి డబ్బుల విషయంలో మాటామాటా పెరిగి...
మనోహరాబాద్(తూప్రాన్): కూలి డబ్బుల తగాదా కాస్తా తాపీమేసీ్త్ర ప్రాణం తీసింది. మనోహరాబాద్ పోలీసుస్టేషన్ పరిధిలోని కాళ్లకల్ గ్రామంలో ఆదివారం జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. తాపీమేసీ్త్రగా పనిచేస్తున్న ప్రమోద్ పాశ్వాన్ (55), బిట్టు దంపతులు కొంతమంది కూలీలతో కలసి భవన నిర్మాణ పనులు చేస్తున్నారు. అయితే అదే గ్రామంలోని శ్రీరామ్ పండరి హైదరాబాద్‌లో ఇంటిని నిర్మిస్తున్నాడు. ఇంటి నిర్మాణపనుల కోసం బిట్టు కూలీలను తీసుకొస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి తాపీమేసీ్త్ర ప్రమోద్ పాశ్వాన్‌కు బిట్టుకు కూలి డబ్బుల విషయంలో గొడవ జరిగింది. ఇద్దరి మధ్యా మాటామాటాపెరిగిన క్రమంలో బిట్టు ఆవేశం ఆపుకోలేక దగ్గర్లోనే ఉన్న కట్టెతో పాశ్వాన్ తలపై బలంగా మోదాడు. దీంతో అక్కడికక్కడే పాశ్వాన్ కుప్పకూలిపోయి మృతి చెందాడు. వెంటనే బిట్టు పారిపోగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చి వివరాలు సేకరించారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పుట్ట నరేశ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment