సమాజ శ్రేయస్సుకే సైన్స్
● జెడ్పీహెచ్‌ఎస్ ఇంద్రకరణ్ విద్యార్థి సౌజన్య రూపొందించిన ‘ది ఫ్లెక్సీ షూస్’
● త్రివేణి స్కూల్ ఇస్నాపూర్ విద్యార్థి అఖిలేశ్వర్‌రెడ్డి రూపొందించిన ‘బై డైరెక్షనల్ యాక్సిడెంట్ ప్రివెన్షన్ సిస్టమ్ ఫర్ ట్రైన్స్’
● త్రివేణి స్కూల్ ఇస్నాపూర్ విద్యార్థి సుశాంత్‌రెడ్డి రూపొందించిన ‘ఎలక్ట్రిక్ ప్రొటెక్షన్ ఫర్ ఎగ్జామ్ పేపర్’
● ఓక్‌డెల్ ఇంటర్నేషనల్ స్కూల్ వడక్‌పల్లి విద్యార్థి ఆయుష్‌కుమార్ రూపొందించిన ‘టాక్‌గురు ట్రాన్సెండింగ్ కమ్యూనికేషన్ బేరియర్స్’.
● జెడ్పీహెచ్‌ఎస్ గుమ్మడిదల విద్యార్థి ప్రణీత్ రూపొందించిన ‘సంజీవని హెలికాప్టర్’
● జ్యోతి విద్యాలయ ఉన్నత పాఠశాల బీహెచ్‌ఈఎల్ విద్యార్థి శాశ్వత రూపొందించిన ‘ట్రీ కటింగ్ నోటిఫైయర్’
● పయనీర్స్ స్కూల్ సంగారెడ్డి విద్యార్థి రుద్ర శరణ్య రూపొందించిన ‘మల్టీపర్పస్ లోడ్ క్యారియర్ ఫర్ హోమ్ నీడ్స్’
● ఓక్‌డేల్ ఇంటర్నేషనల్ వడక్‌పల్లి విద్యార్థి దిశిత వర్మ రూపొందించిన ‘ది షాక్ బస్టర్’
● భారతీయ విద్యాభవన్స్ పబ్లిక్ స్కూల్ బీహెచ్‌ఈఎల్ విద్యార్థి పూర్ణిత్‌రెడ్డి రూపొందించిన ‘హెల్పింగ్ విజువల్లీ డిసేబుల్డ్ పీపుల్ విత్ ద యూజ్ ఆఫ్ ఏ1’.
నేషనల్ ఇన్‌స్పైర్‌కు ఎంపికై న ప్రాజెక్టులు
సంగారెడ్డి ఎడ్యుకేషన్: జీవన ప్రమాణాలలో సైన్స్ ఒక భాగమని, సైన్స్ లేకుంటే జీవితమే సైలెన్స్ అవుతుందని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. సమాజ శ్రేయస్సుకే సైన్స్‌ను ఉపయోగించాలని ఆయన సూచించారు. సంగారెడ్డిలోని శాంతినగర్‌లోని సెయింట్ ఆంథోనీస్ పాఠశాలలో గత మూడు రోజులుగా జరిగిన నేషనల్ ఇన్‌స్పైర్, బాల వైజ్ఞానిక ప్రదర్శనల ముగింపు కార్యక్రమం శనివారం జరిగింది. ఈ ముగింపు వేడుకల సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించారు. నేషనల్ ఇన్‌స్పైర్‌లో 89కి గానూ రాష్ట్రస్థాయికి 9 ప్రాజెక్టులను ఎంపిక చేయగా, బాల వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రాథమికోన్నతస్థాయిలో 14, ఉన్నత పాఠశాల స్థాయిలో 14 ప్రాజెక్టులు, రెండు ఉపాధ్యాయ ప్రదర్శనలు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాయి. ఎంపికై న ప్రాజెక్టులు రూపొందించిన విద్యార్థులతోపాటు గైడ్ టీచర్లకు జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ జ్ఞాపికలతోపాటు ప్రశంసాపత్రాలను అందజేశారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ...సైన్స్‌లో రోజుకొక కొత్త ఆలోచనలు, నూతన ఆవిష్కరణలు వస్తూనే ఉంటాయన్నారు. ఇన్‌స్పైర్‌లో దేశంలో 27 వేల ప్రాజెక్టులు రాష్ట్రస్థాయికి ఎంపికై తే అందులో తెలంగాణ నుంచి 3 వేలు కాగా, అందులో ఏకంగా సంగారెడ్డి జిల్లా నుంచి 95 ప్రాజెక్టులు ఎంపిక కావడం జిల్లాకే గర్వకారణమని తెలిపారు. అనంతరం సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ మాట్లాడుతూ...ఐఐటీ కందిలో ఇటీవలే డ్రైవర్ లేకుండా నడిచే వాహనాలను రూపొందించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో డీఈవో వెంకటేశ్వర్లు, జిల్లా నోడల్ అధికాారి లింబాజి నేషనల్ ఇన్‌స్పైర్ పరిశీలకులు సుభ్రత్, సెయింట్ ఆంథో నీస్ పాఠశాలల అధినేత సాల్మోన్‌రెడ్డి, సైన్స్ అఽధికారి సిద్ధారెడ్డి, ఎంఈవోలు జాకీర్‌హుస్సేన్, విద్యాసాగర్, భీంసింగ్ పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ముగిసిన నేషనల్ ఇన్‌స్పైర్, బాల వైజ్ఞానిక ప్రదర్శనలు
Comments
Please login to add a commentAdd a comment