గురుకుల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
నారాయణఖేడ్/హత్నూర(సంగారెడ్డి): ఖేడ్ మైనార్టీ బాలుర గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలో 2025–26 విద్యా సంవత్సరానికిగాను ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఎం.ఏ.ఖాదర్ తెలిపారు. 5వ తరగతిలో మైనార్టీలకు 60సీట్లు, నాన్ మైనార్టీలకు 20 సీట్లు, 6,7,8 తరగతుల్లో మైనార్టీ సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇంటర్‌లో ఎంఈసీ, సీఈసీ గ్రూపులు ఉండగా ఫస్టియర్‌లో 40 చొప్పున సీట్లు ఉండగా అందులో 30 మైనార్టీ, 10 నాన్ మైనార్టీ సీట్లు ఉన్నాయన్నారు. పూర్తి వివరాలకు 7995057963, 9000082135, 8978559870 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
హత్నూర గురుకుల పాఠశాలల్లోనూ...
అదేవిధంగా ఎస్సీ ఎస్టీ గురుకులాలలో ఆరో తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు మిగిలిపోయిన ఖాళీలలో విద్యార్థులు ప్రవేశాల కోసం ఫిబ్రవరి 1 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు హత్నూర గురుకులం పాఠశాల ప్రిన్సిపల్ భిక్షమయ్య గౌడ్ ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఫిబ్రవరి 23న ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.
కార్డులు, ఇళ్లకోసం
దరఖాస్తులు తీసుకుంటాం
జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో స్వప్న
హత్నూర(సంగారెడ్డి): అర్హులైన ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించేందుకు ఇప్పటికీ రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకోసం దరఖాస్తులు తీసుకుంటామని జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో స్వప్న స్పష్టం చేశారు. హత్నూర మండలం బోరపట్ల గ్రామంలో మంగళవారం నిర్వహించిన గ్రామసభలో స్వప్న పాల్గొని మాట్లాడారు. రైతు భరోసా, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను గ్రామ సభలో ఎంపిక చేసి అర్హులైన ప్రతీ ఒక్కరికి అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో గ్రామసభలు నిర్వహించాలని సూచించారు. చింతల్ చెరువు గ్రామ సభకు డీఎల్పీవో అనిత పాల్గొని దరఖాస్తులను పరిశీలించారు. తురకలో ఖానాపూర్ గ్రామసభలో తహసీల్దార్ పర్వీన్ షేక్ పాల్గొన్నారు.
అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు
సంగారెడ్డి టౌన్: మండలంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ అందించాలని డీఆర్డీవో జ్యోతి స్పష్టం చేశారు. మండలంలోని నాగపూర్,కోత్లాపూర్ గ్రామంలో మంగళవారం నిర్వహించిన గ్రామ సభల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రజలందరికీ రైతు భరోసా, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను గ్రామసభలో ఎంపిక చేసి అర్హులైన వారికి అందించే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు.
ఎంఐఎం ఆఫీస్ ప్రారంభం
నారాయణఖేడ్: ఖేడ్ ఎంఐఎం పార్టీ కార్యాలయాన్ని పార్టీ జిల్లా ఇన్‌చార్జి, కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ మంగళవారం ప్రారంభించారు. పార్టీ ఖేడ్ పట్టణ అధ్యక్షుడు, న్యాయవాది మొహిద్ పటేల్ ఆయనను శాలువా, పూలమాలతో సన్మానించారు. అనంతరం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే మొహియుద్దీన్ మాట్లాడుతూ...పార్టీ బలోపేతంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలకు నాయకులు, కార్యకర్తలు సమాయాత్తం కావాలన్నారు. కార్యక్రమంలో చాంద్‌పాషా, మహ్మద్ అజహర్, షేక్‌అంజద్, అహ్మద్ పటేల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment