సంగారెడ్డి ఎడ్యుకేషన్/పటాన్‌చెరు టౌన్: తెలంగాణ సాయుధ పోరాట అమరుల స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు సుధా భాస్కర్ పేర్కొన్నారు. సీపీఎం రాష్ట్ర మహాసభల సందర్భంగా సంగారెడ్డి పట్టణంలో వీరనారి ఐలమ్మ విగ్రహం వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రజలను పోరాటంలోకి దించి నైజాం నవాబును తరిమి కొట్టింది సీపీఎంనేనని తెలంగాణ సాయుధ పోరాటంలో పాత్రలేని బీజేపీకి దాని గురించి మాట్లాడే హక్కు ఎక్కడిదన్నారు.
25 న భారీ బహిరంగ సభ: రాజయ్య
ఈనెల 25 నుంచి 28వరకు సంగారెడ్డి పట్టణంలో జరిగే సీపీఎం రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు రాజయ్య పిలునిచ్చారు. సంగారెడ్డిలో ఈనెల 25న ఐబీ నుంచి లక్షలాదిమందితో ర్యాలీ ప్రదర్శన అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.
ప్రజా పోరాటాలకు నిదర్శనం
ఫొటో ఎగ్జిబిషన్
సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు
సుధా భాస్కర్
Comments
Please login to add a commentAdd a comment