ఇళ్లు లేని పేదలకే తొలి ప్రాధాన్యం
తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
నారాయణఖేడ్: పార్టీ రహితంగా అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేస్తామని ఎమ్మెల్యే సంజీవరెడ్డి స్పష్టం చేశారు. ఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని 1, 2వ వార్డులతోపాటు మండలంలోని మాద్వార్‌లో మంగళవారం నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఒక్కరేషన్ కార్డుకూడా ఇవ్వకపోగా..డబుల్‌బెడ్‌రూం ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి తదితర హామీలను విస్మరించిందని విమర్శించారు. బీఆర్‌ఎస్ చేసిన రూ.7.50 లక్షల కోట్ల అప్పులు, పెండింగ్ బిల్లులను చెల్లిస్తూ పథకాలను అమలు చేస్తామని వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్లు ముందుగా ఇళ్లులేని పేదలకు ఇచ్చి ప్రాధాన్యతా క్రమంలో అర్హులందరికీ ఇస్తామని హామీనిచ్చారు. రేషన్ కార్డులు సైతం అర్హులకు ఇవ్వడం నిరంతర ప్రక్రియని తెలిపారు.
సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల అందజేత
తుర్కవడగామకు చెందిన బండప్పకు రూ.60 వేలు, పిప్రీకి చెందిన రాములుకు చెందిన రూ.60 వేల సీఎంఆర్‌ఎఫ్ కింద మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే సంజీవరెడ్డి అందజేశారు. నాయీబ్రాహ్మణ సంఘం 2025 నూతన సంవత్సర క్యాలెండర్లను ఆయన ఆవిష్కరించారు. గ్రామసభల్లో ఆర్డీఓ అశోక చక్రవర్తి, మున్సిపల్ కమిషనరు జగ్జీవన్, చైర్మన్ ఆనంద్ స్వరూప్ షెట్కార్, వైస్ చైర్మన్ దారంశంకర్‌సేట్, కౌన్సిలర్లు విఠల్, అభిషేక్ షెట్కార్, నాయీ బ్రాహ్మణ సంఘం సభ్యులు నరేందర్, సంజీవ్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.
పార్టీ రహితంగా పథకాల అమలు
ఎమ్మెల్యే సంజీవరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment