ఓఆర్‌ఎస్‌, ఐవీ ఫ్లూయిడ్స్‌ అందుబాటులో ఉంచాలి | Sakshi
Sakshi News home page

ఓఆర్‌ఎస్‌, ఐవీ ఫ్లూయిడ్స్‌ అందుబాటులో ఉంచాలి

Published Tue, Apr 16 2024 6:45 AM

 మాట్లాడుతున్న డీఎంహెచ్‌ఓ డాక్టర్‌  శ్రీనివాస్‌  - Sakshi

సిద్దిపేటకమాన్‌: వేసవి దృష్ట్యా జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలలో ఓఆర్‌ఎస్‌లు, ఐవీ ఫ్లూయిడ్స్‌ అందుబాటులో ఉంచాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ శ్రీనివాస్‌ అన్నారు. కలెక్టరేట్‌లోని డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో స్టాఫ్‌ నర్సులు, సీనియర్‌ నర్సింగ్‌ అధికారులతో డీఎంహెచ్‌ఓ సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబ్బంది అన్ని ఆరోగ్య కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు. ప్రతి బుధవారం వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నిర్వహించాలన్నారు. గర్భిణుల వివరాలను ఎప్పటికపుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చిన క్షయ, డయాబెటిస్‌, బీపీ, ఎన్‌సీడీ కేసులు, స్క్రీనింగ్‌ పరీక్షలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. వైద్య సిబ్బంది సమయ పాలన పాటించాలని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్‌ వినోద్‌బాబ్జి, డాక్టర్‌ విజయరాణి, డాక్టర్‌ రజని, డాక్టర్‌ శ్రీదేవి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ శ్రీనివాస్‌

Advertisement
Advertisement