పెరిగేనా? | Sakshi
Sakshi News home page

పెరిగేనా?

Published Tue, May 7 2024 6:45 PM

పెరిగ

మంగళవారం శ్రీ 7 శ్రీ మే శ్రీ 2024
పోలింగ్‌ శాతం
మెదక్‌ సెగ్మెంట్‌లో 18.12లక్షల మంది ఓటర్లు
● 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 79.42శాతం.. ● లోక్‌సభ(2019)లో 71.71 శాతం పోల్‌ ● గత అసెంబ్లీలో 80.52 శాతం మంది వినియోగం ● ఓటు వినియోగంలో గ్రామీణులే ముందంజ ● ఈ సారి మరింత పెంచేందుకు విస్తృత కార్యక్రమాలు

సాక్షి, సిద్దిపేట: అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఎంపీ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈ సారైనా పోలింగ్‌ శాతం పెరుగుతుందా? లేదా? అన్న అంశంపై చర్చ జరుగుతోంది. పోలింగ్‌ నమోదును పెంచేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోంది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటూ కీలకమే. అభ్యర్థుల తల రాతను మార్చగలిగే శక్తి ఓటు అనే ఆయుధానికే మాత్రమే ఉంది. అంతటి కీలకమైన ఓటు హక్కు వినియోగంపై ఎన్నికల సంఘం, జిల్లా అధికార యంత్రాంగం విస్తృత ప్రచారం కల్పిస్తున్నప్పటికీ చాలా మంది అంతగా ఆసక్తి చూపడం లేదు. ఓటు వినియోగంలో పట్టణ ప్రాంతాల ప్రజల కంటే గ్రామీణులే ముందుంటున్నారు. ఈ సారి పోలింగ్‌ శాతాన్ని పెంచాలని జిల్లా అధికార యంత్రాంగం స్వీప్‌ ద్వారా విస్తృత అవగాహన కార్యక్రమాలను చేపడుతోంది.

తగ్గిన పోలింగ్‌

గతంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకే సారి జరిగేవి. 2018 నుంచి వేర్వేరుగా జరుగుతున్నాయి. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీల్లో 79.42శాతం పోలింగ్‌ అయ్యింది. 2019 ఎంపీ ఎన్నికల్లో 71.71శాతం పోలింగ్‌ శాతం నమోదైంది. దీంతో 7.71శాతం పోలింగ్‌ తగ్గింది. గత ఎంపీ ఎన్నికల్లో 16,02,947 ఓటర్లుండగా 11,49,490 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మెదక్‌ పార్లమెంట్‌ పరిధిలో..

మెదక్‌ పార్లమెంట్‌ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలో ప్రస్తుతం 18,12,858 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషులు 8,95,777, మహిళలు 9,16,876, ఇతరులు 205 మంది ఉన్నారు. గతేడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలో 17,71,318 మంది ఓటర్లుండగా 14,26,268 (80.52శాతం) మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ నెల 13న జరగనున్న ఎంపీ ఎన్నికల్లో ఎంత మంది తమ ఓటును సద్వినియోగం చేసుకుంటారన్నదానిపైనే చర్చ.

విస్తృత ప్రచారం

ఈ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం మరింత పెంచేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు స్వీప్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. ఇప్పటికే 80ఏళ్లు పైబడిన వారికి, దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పించారు. ఈ నెల 8 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. అలాగే ఎన్నికల విధుల్లో పాల్గొనే వారికి సైతం పోస్టల్‌ బ్యాలెట్‌ అవకాశం కల్పించారు. ర్యాలీలు, 5కే రన్‌లను నిర్వహించి ఓటు హక్కును అందరూ వినియోగించే విధంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

న్యూస్‌రీల్‌

పెరిగేనా?
1/2

పెరిగేనా?

పెరిగేనా?
2/2

పెరిగేనా?

 
Advertisement
 
Advertisement