మంత్రి సీతక్కను కలిసినపీఆర్టీయూ నాయకులు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): మంత్రి సీతక్కను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి, దీపావళి శుభాకాంక్షలు తెలిపినట్లు పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగ మహేందర్‌రెడ్డి తెలిపారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పెండింగ్ సమస్యలు, కేజీబీవీలలో నెలకొన్న సమస్యలను వివరించినట్లు తెలిపారు. తనతో పాటుగా జిల్లా పీఆర్టీయూ ప్రధాన కార్యదర్శి ఆదరసుపల్లి శశిధర్‌శర్మ తదితరులు ఉన్నట్లు తెలిపారు.
పంట మార్పిడితోనే
అధిక లాభాలు
అక్కన్నపేట(హుస్నాబాద్): పంట మార్పిడితోనే అధిక లాభాలు పొందవచ్చని తోర్నాల వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ విజయ్, డాక్టర్ పల్లవి అన్నారు. శుక్రవారం మండలంలోని పంతులు తండాలో ఉచిత జొన్న బ్యాగులను రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంట మార్పిడి వల్ల నేలలోని భూసారాన్ని పెంపొందించవచ్చన్నారు. అలాగే అధిక దిగుబడులను సాధించవచ్చని రైతులకు వివరించారు. ఈకార్యక్రమంలో వ్యవసాధికారులు తదితరులు ఉన్నారు.
ముదిరాజ్‌లను బీసీ (ఏ)లోకి మార్చండి
హుస్నాబాద్‌రూరల్: రాష్ట్రంలోని ముదిరాజ్‌లను బీసీ (డీ) గ్రూపు నుంచి బీసీ(ఏ)లోకి మార్చాలని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్‌కు విజ్ఞప్తి చేసినట్లు సంఘం అధ్యక్షుడు పెండ్యాల అయిలయ్య తెలిపారు. బీసీ కులగణనపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం శుక్రవారం కరీంనగర్‌కు వచ్చిన చైర్మన్‌ను కలిసి ముదిరాజ్ కులస్తుల సమస్యలు వివరించినట్లు చెప్పారు. ముదిరాజ్‌లను బీసీ(ఏ) గ్రూపు మార్చాలని, 50 ఏళ్లు నిండిన ప్రతి ఒకరికీ ఆసరా పింఛన్ ఇవ్వాలన్నారు. మత్స్యకారుల ఉపాధి కోసం సహకార సంఘాలకు నిధులు మంజూరు చేయాలన్నారు. వీరి వెంట ముదిరాజ్ సంఘం నాయకులు పొన్నబోయిన శ్రీనివాస్, ఎడల వనేష్ తదితరులు ఉన్నారు.
డీఎంహెచ్‌ఓగా బాధ్యతలు స్వీకరణ
సిద్దిపేటకమాన్: జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిగా డాక్టర్ పల్వన్‌కుమార్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. వికారాబాద్ డీఎంహెచ్‌ఓగా విధులు నిర్వహిస్తూ జిల్లా నూతన డీఎంహెచ్‌ఓగా ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కార్యాలయంలో డీఎంహెచ్‌ఓను పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు రాజేందర్, రఘుపతిరెడ్డి, మల్లేశం, పలువురు సిబ్బంది ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు వైద్య ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment