మోకాళ్ల యాత్ర చేసినా ప్రజలు నమ్మరు
మెదక్ ఎంపీ రఘునందన్‌రావు
సంగారెడ్డి ఎడ్యుకేషన్: కేటీఆర్ పాదయాత్ర కాదు కదా.. మోకాళ్ల యాత్ర చేసినా ప్రజలు నమ్మరని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. శుక్రవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో సభ్యత్వ నమోదు వర్క్‌షాప్ నిర్వహించారు. ఈసందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ప్రతి కార్యకర్త 100 సభ్యత్వాలు పూర్తిచేసుకొని క్రియాశీల సభ్యత్వం పొందాలన్నారు. మాజీ మంత్రి కేటీఆర్, ఆయన తండ్రి కేసీఆర్ ఇద్దరూ రాజకీయాల నుంచి వైదొలిగిన తెలంగాణ ప్రజలకు ఎలాంటి నష్టం లేదన్నారు. వారు ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి రాలేదని, కేవలం ధనార్జనే ధ్యేయంగా వచ్చారని మండిపడ్డారు. దీపావళికి ముందే రాష్ట్రంలో పెద్ద నాయకుల అరెస్ట్‌లు ఉంటాయని, పండుగకు ముందే పటాకులు పేలుతాయని కాంగ్రెస్ నేతలు చెప్పారని గుర్తు చేశారు. దీపావళి పటాకులు పేలాయి తప్ప రాజకీయ అరెస్ట్‌లు కాలేదని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు గోదావరి, మెదక్ పార్లమెంట్ ఇన్చార్జి లక్ష్మీనర్సయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతరావు కులకర్ణి, నాయకులు రాజశేఖర్‌రెడ్డి, వెంకటనరసింహారెడ్డి, ప్రతాప్‌రెడ్డి, నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి, రాజేశ్వరరావు దేశ్‌పాండే, దోమల విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment