సదర్కు ప్రత్యేక గుర్తింపు
కోహెడ(హుస్నాబాద్): రాష్ట్ర ప్రభుత్వం సదర్ ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తు.. ప్రత్యేక గుర్తింపు ఇస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో సదర్ ఉత్సవం నిర్వహించారు. మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సింధూ నాగరికత నుంచి పశు సంపదను పూజిస్తున్న సంప్రదాయం మనదన్నారు. ప్రతి ఏటా యాదవులు మంచి జరగాలని సదర్ ఉత్సవంలో దున్నను పూజిస్తూ కార్యక్రమం చెపట్టడం సంతోషం అన్నారు. అన్ని కులాలు సుఖసంతోషాలతో ఉండాలని అకాంక్షించారు. అంతకు మందు సీతారామచంద్ర స్వామి ఆలయం నుంచి కొత్త బస్టాండ్ వరకు దున్నలతో యాదవ కులస్తులు భారీ ర్యాలీ నిర్వహించారు. మండల యాదవ సంఘం అధ్యక్షుడు పలుమారు సంతోస్, ఉపేందర్, చంద్రమౌళి, వెంకటస్వామి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు మంద ధర్మయ్య పాల్గొన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్
Comments
Please login to add a commentAdd a comment