‘ప్రజాపాలన’లో ప్రగతికి బాటలు
గజ్వేల్: సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో జనరంజక పాలన కొనసాగుతున్నదని, ప్రజాపాలనతో సమస్యల పరిష్కారానికి బాటలు పడుతున్నాయని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి అన్నారు. గురువారం గజ్వేల్ ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో కాంగ్రెస్ విజయోత్సవ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ 11నెలల పాలనలో ఆరు గ్యారంటీల అమలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సృష్టించిన సమస్యలను ఒక్కొక్కటిగా అధిగమిస్తూ మెరుగైన పాలన అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మల్లన్నసాగర్ నిర్వాసి తుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక కార్యాచరణతో ముందుకుసాగుతున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడాలేనివిధంగా నిర్వాసితులకు ప్యాకేజీలు, పరిహారాలు ఇచ్చి ఆదుకున్నామని కేసీఆర్, హరీశ్‌రావులు చెబుతుండగా, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఇక్కడి సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉన్నదని చెప్పారు. నెల రోజుల్లోగా సీఎంను ఇక్కడికి రప్పించేందుకు ప్రయత్నించి, నిర్వాసితుల సమస్యలు తీరేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ సర్ధార్‌ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్‌తోపాటు నాయకులు పాల్గొన్నారు. విజయోత్సవ ప్రచార కార్యక్రమంలో కళాకారుల ప్రభు త్వ పథకాల అమలుపై ప్రదర్శనలు నిర్వహించారు.
‘మల్లన్న’ నిర్వాసితుల ఇబ్బందులు తొలగిస్తాం
డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment