చేనేత కార్మికులను ఆదుకోవాలి
చేర్యాల(సిద్దిపేట): చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వనం శాంతికుమార్ కోరారు. సోమవారం స్థానిక చేనేత సహకార సంఘ కార్మికులతో మాట్లాడారు. కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ నేడు అభివృద్ధి చెందాల్సిన చేనేత పరిశ్రమను కావాలని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్ర పన్నుతోందన్నారు. మగ్గాలపై వస్త్రాలు నేస్తున్న చేనేత కార్మికులకు నూలు అందించే విషయంలో జాప్యం జరుగుతోందని అన్నారు. చేతినిండా పని దొరకక, కూలి గిట్టుబాటు కాక కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. సంప్రదాయంగా వస్తున్న చేనేత పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. వెంటనే చేనేత కార్మికుల సంక్షేమ అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేసి, రూ.1000 కోట్ల బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రతి చేనేత కార్మికునికి రూ.5లక్షల పెట్టుబడి సహాయం అందించాలన్నారు. ఇల్లు లేని చేనేత కార్మికులకు హౌస్ కం వర్క్ షెడ్ పథకాన్ని పునరుద్ధరించి, ఆరోగ్య భీమా పథకాన్ని ప్రవేశపెట్టాలన్నారు. కార్యక్రమంలో తెలంగాణ చేనేత కార్మిక సంఘం మాజీ అధ్యక్షుడు శంకరయ్య, రాష్ట్ర కార్యదర్శి నరహరి, వ్యవసాయ కార్మికసంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్‌మావో, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
చేనేత కార్మిక సంఘం
రాష్ట్ర అధ్యక్షుడు శాంతికుమార్
Comments
Please login to add a commentAdd a comment