క్రీడాకారులకు ప్రోత్సాహం
అట్టహాసంగా మల్లకంబ పోటీలు
సమగ్ర సర్వేలో తప్పులు రావొద్దు
సిద్దిపేటరూరల్: నారాయణరావుపేట ఉన్నత పాఠశాలలో మల్లకంబ పోటీలు అట్టహాసంగా జరిగాయి. సోమవారం ఉమ్మడి జిల్లా అండర్ 14 ,17 బాలురకు పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి గౌరీమోహన్ మాట్లాడుతూ ప్రాచీన క్రీడ అయిన మల్లకంబను మన ప్రాంతంలో కూడా ప్రోత్సహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. చాలా అరుదై న, కఠినమైన క్రీడను పాఠశాలల్లో ఎంతో చక్క గా నేర్పిస్తున్నారన్నారు. రాష్ట్రస్థాయిలో చక్కని ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపిక కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పోటీలకు తడకపల్లి ఆవాస విద్యాలయం, రాఘవాపూర్, నారాయణరావుపేట విద్యార్థులు హాజరయ్యారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు.
బెజ్జంకి(సిద్దిపేట): సేకరించిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలను తప్పులు లేకుండా నమోదు చేయాలని కలెక్టర్ మనుచౌదరి సూచించారు. బెజ్జంకి మండల పరిషత్ కార్యాలయంలో సర్వే నమోదు వివరాలను సోమవారం ఆయన పరిశీలించారు. ఎన్యుమరేటర్లు, ఆపరేటర్‌లు సమన్వయంతో డేటా నమోదును వేగంతం చేయాలని సూచించారు. అనంతరం కేజీవీబి పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. వంటశాలలోని భోజన వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలకు అవసరమైన కంప్యూటర్, గ్రంథాలయాన్ని మంజూరు చేయాలని విద్యార్థులు కోరగా సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రవీణ్, ఎంఈఓ మహతిలక్ష్మి, హెచ్‌ఎం పావని, ఎంపీఓ మంజుల, పీఓ శ్వేత తదితరులు పాల్గొన్నారు.
పది రోజుల్లో కొనుగోళ్లు పూర్తిచేయండి
కోహెడరూరల్(హుస్నాబాద్): పది రోజుల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. సోమవారం మండలంలోని శనిగరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల్లోని రైతులతో మాట్లాడారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రాల వద్ద రైతులు నిరీక్షించ కుండా క్రమ పద్ధతిలో ధాన్యం బస్తాలను తూకం వేయాలని అన్నారు.
కలెక్టర్ మనుచౌదరి
మిరుదొడ్డి(దుబ్బాక): నియోజకవర్గంలోని క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మిరుదొడ్డిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్‌లో మినీస్టేడియం ఏర్పాటుకు సోమవారం ఆయన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... క్రీడాకారులకు అవసరమైన ఆట స్థలం ఉంటేనే క్రీడా నైపుణ్యాలకు పదును పెడతారన్నారు. క్రీడా రంగంలో ప్రతి క్రీడాకారుడు రాణించడానికి మినీ స్టేడియం ఏర్పాటు ఎంతైనా అవసరమన్నారు. అనంతరం కళాశాలను సందర్శించారు. కళాశాలలో నెలకొన్న సమస్యలపై లెక్చరర్లను ఆయన అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు తోట అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మినీస్టేడియం ఏర్పాటుకు కృషి
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment