అసెంబ్లీలో కొట్లాడుతా..
సిద్దిపేటజోన్: కేసీఆర్ ఆశీస్సులతో సిద్దిపేటను జిల్లా చేసి, ఇక్కడికి రైలు, సుడా, గోదారి జలాలతో అభివృద్ధి చేసుకుంటే, ఓర్వలేని కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధికి మోకాలడ్డు పెడుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. సిద్దిపేట అభివృద్ధిని అడ్డుకున్నా.. నిధులను ఇవ్వకున్నా వదిలిపెట్టేది లేదని, అసెంబ్లీలో కొట్లాడుతానని, అవసరమైతే కోర్టుకు వెళ్తానని హరీశ్ స్పష్టం చేశారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని 104 మంది లబ్ధిదారులకు రూ.25 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వైద్య రంగాన్ని నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు, కేసీఆర్ కిట్స్, న్యూట్రిషన్ కిట్స్ ఇవ్వడం బంద్ చేసిందని విమర్శించారు. రూ.24 కోట్లతో సిద్దిపేట జిల్లా ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ యూనిట్ మంజూరు చేస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని రద్దు చేసి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారని విమర్శించారు. సిద్దిపేట జిల్లాకు క్యాన్సర్ బాధితులకు అవసరమైన కీమోథెరీపీ, రేడియో థెరపీ మంజూరు చేస్తే దాన్ని కూడా రద్దు చేసిందని ఆరోపించారు. రూ. 200 కోట్లతో రోడ్డు పనులు మంజూరు చేస్తే వాటిని రద్దు చేసి మంత్రి సీతక్క ములుగుకు తీసుకుపోయారని ఆరోపించారు. తాను కోట్లాడి నిధులు మంజూరు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేస్తోందని విమర్శించారు.
అవసరమైతే కోర్టుకు వెళ్తా..
సిద్దిపేట ప్రగతికి కాంగ్రెస్ మోకాలడ్డు
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు
Comments
Please login to add a commentAdd a comment