నష్టపరిహారం అందించండి
కలెక్టరేట్ ఎదుట భూ నిర్వాసితుల ధర్నా
సిద్దిపేటరూరల్: కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన మాకు ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారం ఇచ్చి న్యాయం చేయాలని బాధితులు కోరారు. ఈ మేరకు మామిడియాల భ నిర్వాసితులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించిన తమను ప్రభుత్వం పట్టించుకోకపోవడం తగదన్నారు. నిర్మాణానికి ఇళ్లు, భూములు తీసుకుని ఆర్అండ్ఆర్ ప్యాకేజి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అప్పటి మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, ఆర్డీఓ విజయేందర్రెడ్డిలు గ్రామ నాయకులకు సహకరించి వారు చెప్పినవారికే ప్యాకేజీలు అందించారన్నారు. అనంతరం అదనపు కలెక్టర్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ స్పందిస్తూ రావాల్సిన ప్యాకేజీలను అందిస్తామని, ఎవరూ అధైర్యపడొద్దని హామీ ఇచ్చారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment