డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి
సిద్దిపేటరూరల్: మాక్ పార్లమెంట్ కార్యక్రమంతో విద్యార్థులకు చట్టసభల కార్యకలాపాలపై అవగాహన ఏర్పడుతుందని డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం సిద్దిపేట రూరల్ మండలం చిన్నగుండవెళ్లి ఉన్నత పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని మాక్ పార్లమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఈఓ హాజరై మాట్లాడారు. మాక్ పార్లమెంట్‌తో ప్రతిపక్షం, పాలకపక్షంల ప్రాధాన్యత గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో హెచ్ఎం రవీందర్, కాంప్లెక్స్ హెచ్ఎం శ్రీనివాస్, ఏఏపీసీ చైర్మన్ పాపవ్వ, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం రాధపద్మజ, స్పెషల్ ఆఫీసర్ సౌమ్య, పంచాయతీ కార్యదర్శి రమాదేవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment