వన్డే ప్రపంచకప్-2023లో పాకిస్తాన్ తొలి ఓటమిని చవిచూసింది. శనివారం అహ్మదాబాద్ వేదికగా చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అయితే ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఒకనొకరు పలుకరించుకుని ఆప్యాయంగా మాట్లాడుకున్నారు.
ఈ సందర్భంగా కోహ్లి తను సంతకం పెట్టిన జెర్సీలను బాబర్‌కు గిప్ట్‌గా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే బాబర్ ఆజం బహిర్గతంగా కెమరాలముందు కోహ్లి నుంచి జెర్సీలను తీసుకోవడాన్ని పాక్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ తప్పుబట్టాడు.
మ్యాచ్ అనంతరం పాకిస్తాన్‌కు చెందిన ఏ-స్పోర్ట్స్ ఛానల్‌లో అక్రమ్ మాట్లాడుతూ.."బాబర్ చేసిన పని నాకు నచ్చలేదు. ఒకవేళ తనకు కోహ్లి జెర్సీకావాలనుకుంటే కెమెరాల ముందు కాకుండా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లి అడగాల్సింది. నాకు తెలిసినంత వరకు బాబర్ మామ కొడుకు కూడా కోహ్లి జెర్సీ కావాలని అడిగాడు. ఏదమైనప్పటికి బాబర్ మాత్రం ఇలా పబ్లిక్‌గా కాకుండా వాళ్ల రూమ్‌కు వెళ్లి తీసుకోవాల్సంది అని చెప్పుకొచ్చాడు.
చదవండి: CWC 2023: పాక్‌ను చిత్తు చేసిన భారత్.. రోహిత్ సేనను అభినందించిన నరేంద్ర మోదీ
Wasim Akram says "Babar Azam shouldn't have asked Virat Kohli his Tshirt"pic.twitter.com/KREc7H41Pm#INDvsPAK #indvspak2023 #Rizwan #RohitSharma𓃵 #IndiaVsPakistan #CWC23 #ICCCricketWorldCup23 pic.twitter.com/NEhiFEzEMp
— ICT Fan (@Delphy06) October 14, 2023
Comments
Please login to add a commentAdd a comment