Virat Kohli On Suryakumar Achievements: Creating Different Template I Can See - Sakshi
Sakshi News home page

Ind Vs SL: ఇలాంటి ఆటగాడిని చూడలేదు.. ఆ ప్రేమ నిజం! కోహ్లి ప్రశంసల జల్లు

Published Wed, Jan 11 2023 1:47 PM | Last Updated on Wed, Jan 11 2023 3:40 PM

Kohli On Suryakumar Achievements: Creating Different Template I Can See - Sakshi

విరాట్‌ కోహ్లి

India vs Sri Lanka- Virat Kohli- Suryakumar Yadav: టీమిండియా టీ20 స్టార్‌ సూర్యకుమార్‌ యాదవ్‌పై రన్‌మెషీన్‌ విరాట్‌ కోహ్లి ప్రశంసల జల్లు కురిపించాడు. గతేడాది కాలంగా అద్భుత ఆట తీరుతో అందరి మనసులు కొల్లగొడుతున్నావంటూ కొనియాడాడు. ఆటకు సరికొత్త నిర్వచనం ఇస్తున్నావంటూ కితాబులిచ్చాడు. కాగా 2022లో సూర్య పొట్టి ఫార్మాట్‌లో దంచికొట్టిన సంగతి తెలిసిందే.

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌ 1గా ఎదిగిన స్కై.. గతేడాదికి గానూ ఈ ఫార్మాట్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. అంతేగాక.. శ్రీలంకతో టీ20 సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్‌లో సెంచరీ చేసి కొత్త ఏడాదిని ఘనంగా ఆరంభించాడు. ఇప్పటి వరకు మొత్తంగా అంతర్జాతీయ టీ20లలో ఈ ముంబై బ్యాటర్‌ మూడు శతకాలు బాదడం విశేషం.

ఇదిలా ఉంటే.. టీమిండియా మాజీ కెప్టెన్‌ కోహ్లి... శ్రీలంకతో స్వదేశంలో మంగళవారం (జనవరి 10)తొలి వన్డేలో సెంచరీ కొట్టిన విషయం తెలిసిందే. తద్వారా అంతర్జాతీయ కెరీర్‌లో 73వ శతకం నమోదు చేశాడు. ఈ క్రమంలో మ్యాచ్‌ అనంతరం సూర్యకుమార్‌.. కోహ్లిని ఇంటర్వ్యూ చేశాడు.

ఇలాంటి ఆటగాడిని చూడలేదు
ఈ సందర్భంగా కోహ్లి మాట్లాడుతూ.. సూర్యను ఆకాశానికెత్తాడు. ‘‘గతేడాది కాలంగా నువ్వు సాధించిన విజయాలు ఎంతో ప్రత్యేకమైనవి. నేను ఇంతకు ముందు ఇలాంటి ఆటగాడిని చూడలేదు. ఆటలో వైవిధ్యం ప్రదర్శిస్తూ ముందుకు సాగుతున్నావు.

సరికొత్త ఉత్సాహంతో అడుగులు వేస్తూ నీ చుట్టూ ఉన్న వాళ్లలో ఉత్తేజాన్ని నింపుతున్నావు. నువ్వు మైదానంలో వెళ్తున్న సమయంలో నేను చాలా సార్లు ప్రేక్షకులను గమనించాను. నీ పట్ల వాళ్ల ఆప్యాయత, అనురాగాలు.. నీపై వాళ్లు కురిపిస్తున్న ప్రేమ ఎంతో స్వచ్ఛమైనది. నిన్నిలా చూడటం చాలా చాలా సంతోషంగా ఉంది’’ అని బీసీసీఐ ఇంటర్వ్యూలో కోహ్లి.. సూర్యపై ప్రశంసలు కురిపించాడు. అతడి కెరీర్‌ ఉజ్వలంగా సాగాలని ఆకాంక్షించాడు. వీరిద్దరి సంభాషణకు సంబంధించిన వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది.

చదవండి:  టీమిండియా యువ ఓపెనర్‌ విధ్వంసం.. క్వాడ్రపుల్‌ సెంచరీ మిస్‌! అయితేనేం.. దిగ్గజాల రికార్డులు బద్దలు
Kohli-Pandya: పాండ్యాపై గుడ్లురిమిన కోహ్లి! సెంచరీ మిస్‌ అయ్యేవాడే! వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement