ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పర్వాలేదనపిస్తున్నప్పటికీ.. టెస్టు క్రికెట్‌లో మాత్రం పూర్తిగా తేలిపోతున్నాడు. అతడు తన చివరి 17 ఇన్నింగ్స్‌లో కేవలం ఒక్కసారి మాత్రమే 50 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. లండన్ వేదికగా భారత్‌తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో కూడా డేవిడ్ భాయ్ తన పేలవ ఫామ్‌ను కొనసాగించాడు.
ఇక ఫామ్ కోల్పోయి విమర్శలు ఎదుర్కొంటున్న వార్నర్‌కు యాషెస్ రూపంలో మరో గట్టి సవాలు ఎదురుకానుంది. జూన్ 16 నుంచి ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జూన్ 16 నుంచి జూన్ 20 వరకు జరగనుంది.
ఇక సిరీస్ ప్రారంభానికి ముందు వార్నర్‌కు ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ మద్దతుగా నిలిచాడు. ఈ చారిత్రాత్మక సిరీస్‌లో సరికొత్త డేవిడ్ వార్నర్‌ను చూస్తామని కమ్మిన్స్ థీమా వ్యక్తం చేశాడు. అయితే వార్నర్‌ను మరో సమస్య కూడా వెంటాడుతోంది. ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్‌కు డేవిడ్ వార్నర్‌పై మంచి రికార్డు ఉంది. 2019 యాషెస్ సిరీస్‌లో వార్నర్‌ను బ్రాడ్ ఏకంగా 7 సార్లు ఔట్ చేశాడు.
ఈ సారి వార్నర్ బ్రాడ్‌ను ఎలా ఎదుర్కొంటాడో చూడాలి మరి. ఈ నేపథ్యంలో కమ్మిన్స్ మాట్లాడుతూ.. "డేవిడ్ కచ్చితంగా బ్రాడ్ గురించి కచ్చితంగా ఆలోచిస్తుంటాడు. ఎందుకంటే గత నాలుగేళ్లుగా అతడి చేతిలోనే తన వికెట్‌ను కోల్పోతున్నాడు.
బ్రాడ్‌కు వ్యతేరేకంగా ఆడేందుకు వార్నర్‌కు ఇప్పుడు మరో అవకాశం దొరికింది. అయితే ఇప్పటివరకు ఒకరకమైన వార్నర్‌ను చూశాం.. కానీ ఈ సారి మాత్రం సరికొత్త డేవీని చూస్తాం. బ్రాడ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొంటాడు" అని పేర్కొన్నాడు.
తొలి టెస్టుకు తుది జట్లు(అంచనా)
ఇంగ్లండ్: హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, జో రూట్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), మొయిన్ అలీ, ఓలీ పోప్ (వికెట్ కీపర్), జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, ఓలీ రాబిన్‌సన్, మార్క్ వుడ్
ఆసీస్: ఉస్మాన్ ఖవాజా, డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, బోలాండ్, నాథన్ లయాన్
Comments
Please login to add a commentAdd a comment