జెడ్పీ సమావేశం వాయిదా | Sakshi
Sakshi News home page

జెడ్పీ సమావేశం వాయిదా

Published Sun, May 5 2024 3:00 AM

జెడ్పీ సమావేశం వాయిదా

నెల్లూరు(పొగతోట): కోరం లేక జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. చైర్‌పర్సన్‌ ఆనం అరుణమ్మ అధ్యక్షతన శనివారం నెల్లూరు జెడ్పీ సమావేశ మందిరంలో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. సభ్యులకు, అధికారులకు సీఈఓ కన్నమనాయుడు ఆహ్వానాలు పంపించారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న నేపథ్యంలో కొత్త వాటికి అనుమతి ఇవ్వకుండా, రాజకీయ అంశాలు చర్చించకుండా అధికారులతో సమీక్షించవచ్చని సీఈఓ తెలిపారు. నిబంధనలకు లోబడి మాత్రమే సమావేశం నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే నలుగురు జెడ్పీటీసీలు, కో–ఆప్షన్‌ సభ్యులు, అల్లూరు ఎంపీపీ మాత్రమే హాజరయ్యారు. కోరం లేకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు అరుణమ్మ ప్రకటించారు.

Advertisement
Advertisement