ఓటింగ్‌ శాతం పెంపే లక్ష్యం | Sakshi
Sakshi News home page

ఓటింగ్‌ శాతం పెంపే లక్ష్యం

Published Mon, May 6 2024 1:20 AM

ఓటింగ్‌ శాతం పెంపే లక్ష్యం

నెల్లూరు(బారకాసు): జిల్లాలోని ఓటర్లలో చైతన్యం తీసుకొచ్చి పోలింగ్‌ శాతాన్ని పెంచడమే ప్రధాన లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ హరినారాయణన్‌ పేర్కొన్నారు. స్వీప్‌ కార్యక్రమాల్లో భాగంగా ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించే ప్రచార రథాలను నగరపాలక సంస్థ కార్యాలయ ప్రాంగణంలో ఆదివారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. అన్ని నియోజకవర్గాల్లో ఈ నెల 12న వరకు ప్రచార రథాల ద్వారా అవగాహన కల్పించనున్నామని వివరించారు. అనంతరం ఓటర్లను చైతన్యపర్చేలా మస్కట్‌, బెలూన్‌ను ఆర్టీసీ బస్టాండ్‌ ఆవరణలో ఆవిష్కరించారు. నోడల్‌ అధికారులు బాపిరెడ్డి, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

పోస్టల్‌ బ్యాలెట్‌కు గడువు పొడిగింపు

నెల్లూరు(దర్గామిట్ట): పోస్టల్‌ బ్యాలెట్‌ దాఖలుకు సంబంధించిన గడువును ఈ నెల ఎనిమిది వరకు పొడిగించారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ హరినారాయణన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో విధుల్లో ఉన్న ఇతర జిల్లాల వారు అక్కడ ఫారం – 12ను అందజేసి పోస్టల్‌ బ్యాలెట్‌ను పొందాలని సూచించారు.

తొలి రోజు 6251 ఓట్లు

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌లో తొలి రోజు 6251 ఓట్లు పోలయ్యాయి. నెల్లూరు సిటీలో 2419 మందికి గానూ 812.. నెల్లూరు రూరల్‌లో 4304కు గానూ 1372.. కందుకూరులో 1635 గానూ 573.. కావలిలో 2933కు గానూ 870, ఆత్మకూరులో 2352కు గానూ 706, ఉదయగిరిలో 2336 గానూ 711, సర్వేపల్లిలో 1268కు గానూ 387, కోవూరులో 2587కు గానూ 820 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Advertisement
Advertisement