వాన పడితే పరదాలే ఫైళ్లకు రక్ష
నెల్లూరు(అర్బన్): చిన్నపాటి వర్షాలకు సైతం పలు ప్రభుత్వ కార్యాలయాలు ఉరుస్తూ ఉంటాయి. వాటిని సరిచేసేందుకు నిధులు లేక అధికారులు ఇబ్బందులు పడుతుంటారు. అయితే జిల్లా పాలనకు కేంద్ర బిందువైన కలెక్టరేట్లో సైతం మంగళవారం ఇలాంటి పరిస్థితే కనిపించింది. నగరంలో కురుస్తున్న వర్షాలకు కలెక్టర్ కార్యాలయంలో సైతం లీకేజీలు ఏర్పడ్డాయి. అక్కడక్కడ వర్షపు నీటి బిందువులు పడుతుండటంతో ఒక సెక్షన్లోని ఫైళ్లు తడిచి పోకుండా ప్లాస్టిక్ పట్టలు కప్పారు. ఆ పరదాల మాటునే అధికారులు తమ విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ దృశ్యాన్ని ‘సాక్షి’ క్లిక్ మనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment