భర్త చేతిలో భార్య దారుణహత్య
బిట్రగుంట: బోగోలు మండలం విశ్వనాథరావుపేటలో భర్త చేతిలో భార్య దారుణ హత్యకు గురైన ఘటన మంగళవారం రాత్రి జరిగింది. అనుమానం పెనుభూతంగా మారి భర్త పాశవికంగా కత్తితో దాడి చేయడంతో భార్య జలచిత్ర తస్లీమా (38) అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు విశ్వనాథరావుపేటకు చెందిన జలచిత్త తస్లీమా, దత్తాద్రి భార్యాభర్తలు. కుటుంబ కలహాలు, అనుమానం నేపథ్యంలో కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం రాత్రి కూడా మరో మారు భార్యాభర్తలు గొడవపడగా దత్తాద్రి భార్య తస్లీమాపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన తస్లీమా అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న వెంటనే కావలి డీఎస్పీ శ్రీధర్, బిట్రగుంట ఎస్సై భోజ్యా ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి స్థానికులు, మృతురాలి కుమారుడిని విచారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. పరారీలో ఉన్న భర్త దత్తాద్రి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment