కడప సెవెన్‌రోడ్స్ : డిసెంబర్ 8వ తేదీ వెనుకబడిన రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల సదస్సు కడపలో నిర్వహిస్తామని ఉక్కు సాధన ఐక్యవేదిక అధ్యక్షుడు నారాయణ, సీఆర్వీ ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లయినా విభజన చట్టంలోని కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని ఇప్పటి వరకు చేపట్టలేదన్నారు. బడ్జెట్లో రూ. 25 కోట్లు దీనికి కేటాయించడాన్ని బట్టి చూస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోందన్నారు. స్టీల్ ప్లాంట్ నిర్మాణ బాధ్యత కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్‌దేనని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమరావతి నిర్మాణంపై చూపుతున్న శ్రద్ధ వెనుకబడిన జిల్లాలపై లేదని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment