కలిగిరి: కలిగిరిలో బీసీ బాలికల వసతి గృహం, సిద్ధనకొండూరులో ఎస్సీ బాలుర వసతి గృహాలు ఉన్నాయి. కలిగిరిలోని బీసీ బాలికల వసతి గృహంలో 12 మంది విద్యార్థినులున్నారు. అద్దె భవనంలో దీనిని నిర్వహిస్తున్నారు. వింజమూరు బాలికల వసతి గృహం వార్డెన్ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. రోజు మార్చి రోజు వచ్చి చూసి వెళుతుంటారు. సిద్ధనకొండూరు బాలుర వసతి గృహంలో 43 మంది విద్యార్ధులు ఉన్నారు. ఇది శిథిలావస్థకు చేరి కూలేందుకు సిద్ధంగా ఉంది. విద్యార్థులు ఉండే గదులకు తలుపులు, కిటికీలు సక్రమంగా లేవు. స్లాబులు పెచ్చులూడి పడుతున్నాయి. చిన్నపాటి వర్షం కురిసినా గదులన్నీ ఉరుస్తున్నాయి. ఫ్లోరింగ్ పూర్తిగా దెబ్బతింది. బాత్‌రూములు కొన్నింటికి తలుపులు లేవు. ప్రహరీ లేకపోవడంలో తరచూ పొలాల్లో నుంచి విషసర్పాలు, కిటకాలు వసతి గృహంలోకి వస్తున్నాయి.
సిద్ధనకొండూరులోని ఎస్సీ బాలుర వసతి గృహంలో తలుపులు లేని మరుగుదొడ్లు
Comments
Please login to add a commentAdd a comment