● ఊపిరాడక మహిళ మృతి
నెల్లూరు(క్రైమ్): విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మెడికల్ ఏజెన్సీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దట్టమైన పొగతో ఊపిరాడక వివాహిత మృతిచెందిన ఘటన నెల్లూరులోని కోరంవారి వీధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ట్రంకు రోడ్డు కోరంవారి వీధికి చెందిన రాజ్యలక్ష్మి (43), రామకృష్ణ దంపతులు తమ ఇంటిి కింది భాగంలో శ్రీదుర్గా పేరిట మెడికల్ ఏజెన్సీ నిర్వహిస్తున్నారు. ఈనెల 18వ తేదీ సోమవారం రాత్రి రాజ్యలక్ష్మి తన సెల్‌ఫోన్‌ను షాపులో మర్చిపోయి ఇంట్లోకి వెళ్లింది. మంగళవారం ఉదయం ఫోన్‌ను తీసుకునేందుకు ఆమె షాపు లోపలికి వెళ్లింది. అప్పటికే అక్కడ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి మందులు, వస్తువులు కాలిపోయి దట్టమైన పొగ ఆవరించింది. దీంతో ఆమెకు ఊపిరాడక సొమ్మసిల్లి పడిపోయింది. భార్య రాలేదని రామకృష్ణ షాపు వద్దకు వెళ్లాడు. కిందపడిపోయి ఉన్న ఆమెను చూసి చికిత్స నిమిత్తం రామచంద్రారెడ్డి హాస్పిటల్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే రాజ్యలక్ష్మి మృతిచెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు రామకృష్ణ సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇన్‌స్పెక్టర్ మద్దిశ్రీనివాసరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment