ఎన్నో బాధలు.. కదిలిస్తే కన్నీటి సుడులు
● ఆస్తి కోసం ఇంటి నుంచి
గెంటేశారని ఓ తండ్రి ఆవేదన●
● ఎస్పీ ఆధ్వర్యంలో
‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’
● 77 ఫిర్యాదుల అందజేత
నెల్లూరు(క్రైమ్): ‘ఆస్తి విషయమై కుమారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారయ్యా. చిత్రహింసలు పెడుతున్నారు. విచారించి నాకు న్యాయం చేయండి’ అని బోగోలుకు చెందిన ఓ వృద్ధుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ‘నా కుమారులు ఉదయ్‌కిరణ్, సుబ్రహ్మణ్యంలు ఆస్తి కోసం వేధిస్తున్నారు. ఇంటి నుంచి గెంటేశారు’ అంటూ మనుబోలుకు చెందిన ఓ వ్యక్తి కన్నీటి పర్యంతమయ్యాడు. ఉద్యోగం పేరిట మోసగించారు.. అత్తింటి ఆరళ్లను తట్టుకోలేకున్నాం.. కుమారుడి మరణంపై అనుమానం ఉంది.. ఇలా ఒక్కొక్కరిది ఒక్కోగాథ.. క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కాకపోవడంతో జిల్లా కేంద్రానికి వచ్చారు. సోమవారం ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్‌హాల్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ జి.కృష్ణకాంత్‌కు వినతులిచ్చారు. స్పందించిన ఎస్పీ సిబ్బందితో ఫోన్‌లో మాట్లాడి సమస్యలను సత్వరమే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. ఆస్తి కోసం తల్లిదండ్రులను వేధించే పిల్లలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా నలుమూలల నుంచి 77 మంది విచ్చేసి ఫిర్యాదులు అందజేశారు. కార్యక్రమంలో నెల్లూరు నగర, రూరల్, డీటీసీ డీఎస్పీలు డి.శ్రీనివాసరెడ్డి, ఘట్టమనేని శ్రీనివాసరావు, గిరిధర్, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసరెడ్డి, ఎస్‌బీ 1, 2, పీసీఆర్ ఇన్‌స్పెక్టర్లు డి.వెంకటేశ్వరరావు, బి.శ్రీనివాసులురెడ్డి, దశరథ రామారావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment