ఒకే ప్రాంతంలో.. గంటల వ్యవధిలో..
● రైలు కింద పడి ఇద్దరి ఆత్మహత్య
నెల్లూరు(క్రైమ్): ఏం కష్టం వచ్చిందో తెలియదు గానీ ఒకే ప్రాంతంలో గంటల వ్యవధిలో ఇద్దరు గుర్తుతెలియని యువకులు రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డారు. రైల్వే పోలీసుల కథనం మేరకు.. ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో చైన్నె వైపు వెళ్లే రైలు పట్టాలపై సోమవారం ఉదయం ఆరు గంటల సమయంలో గుర్తుతెలియని యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి వయసు 25 నుంచి 30 ఏళ్లలోపు ఉంటుందని భావిస్తున్నారు. నలుపు రంగుపై తెలుపు చెక్స్ గల ఫుల్హ్యాండ్స్ చొక్కా, నలుపు రంగు జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నాడు.
పది గంటలకు..
నక్కలోళ్ల సెంటర్లో చైన్నె వైపు వెళ్లే రైలు పట్టాలపై సోమవారం ఉదయం 10 గంటలకు గుర్తుతెలియని యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి వయసు సుమారు 30 సంవత్సరాలు ఉండొచ్చని భావిస్తున్నారు. నలుపు రంగు ఫుల్హ్యాండ్స్ చొక్కా, గ్రే కలర్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. ఈ ఘటనలపై నెల్లూరు రైల్వే ఎస్సై జి.మాలకొండయ్య కేసులు నమోదు చేశారు. మృతదేహాలను జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలిసిన వారు నెల్లూరు రైల్వే పోలీసులను సంప్రదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment