కాశీ విశ్వేశ్వరునికి రుద్రాభిషేకం
సంగం: మండలంలోని సంగం తిరుమనకొండలో ఉన్న రాజరాజేశ్వరీదేవి సమేత కాశీ విశ్వేశ్వరస్వామి జ్ఞానపీఠంలో సోమవారం పూజా కార్యక్రమాలు జరిగాయి. ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి దంపతులు పాల్గొన్నారు. కార్తీక మాసం 4వ సోమవారం సందర్భంగా సంగం ఆర్యవైశ్య సంఘం సభ్యుల ఆధ్వర్యంలో పూజలు, అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి రాజరాజేశ్వరానందస్వామి మాట్లాడుతూ భగవంతుడిని పూజిస్తే సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య పెద్దలు గునుపూడి గిరిబాబు, వేమా మల్లికార్జునరావు, గుప్తా, రామారావు, శ్రీరాం, మల్లికార్జున సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
చేపల వేటకు విరామం
ముత్తుకూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారినందున మత్స్యకారులు చేపల వేటకు విరామం ప్రకటించారు. సముద్రంలో వాతావరణం ప్రతికూలంగా ఉంది. దీంతో నేలటూరు, కృష్ణపట్నం, ఈపూరు పట్టపుపాళెం మత్స్యకారులు ముందు జాగ్రత్తగా పడవలు, వలలను ఒడ్డుకు చేర్చుకుని భద్రపరుచుకున్నారు. అధికారులు కూడా వేటకు వెళ్లొద్దని హెచ్చరించడంతో అధిక సంఖ్యలో మత్స్యకారులు గ్రామాలకే పరిమితమవుతున్నారు.
అదనపు కట్నం కోసం వేధింపులు
నెల్లూరు(క్రైమ్): అదనపు కట్నం కోసం భార్యను వేధించిన భర్త, అత్తింటివారిపై మహిళా పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. కోవూరుకు చెందిన స్పందనకు ఇందుకూరుపేటకు చెందిన చంద్రశేఖర్‌తో 2010లో వివాహమైంది. ఆ సమయంలో ఆమె కుటుంబసభ్యులు రూ.3 లక్షల నగదు, 30 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.లక్ష విలువైన గృహోపకరణాలను కట్నకానుకుల కింద చంద్రశేఖర్ కుటుంబసభ్యులకు ఇచ్చారు. కొంతకాలం వీరి కాపురం సజావుగా సాగింది. అనంతరం భర్త, అత్తింటివారు ఆమెను రూ.2 లక్షల అదనపు కట్నం కోసం వేధించసాగారు. ఈ మేరకు బాధితురాలు సోమవారం మహిళా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్ టీవీ సుబ్బారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment